Adani Power: దేశంలో ప్రైవేటు విద్యుత్ రంగ సంస్థ అదానీ పవర్ తాజాగా తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీనికి ముందు టాటాల నేతృత్వంలో నడుస్తున్న టాటా పవర్ సైతం అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది.
నాలుగో త్రైమాసికంలో అదానీ పవర్ కంపెనీ రూ.5,242 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.4,645.47 కోట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపధికన 13 శాతం అధిక లాభాన్ని నమోదు చేసింది. 2023 మెుత్తం ఆర్థిక సంవత్సరం నాలుగు త్రైమాసికాల్లో కలిగి కంపెనీ రూ.10,727 కోట్లను నికర లాభంగా నమోదు చేసింది.

ఇక టాటా పవర్ సైతం లాభాల విషయంలో ఏమాత్రం తగ్గనంటూ మంచి ఫలితాలను నమోదు చేసింది. నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ.939 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే 48 శాతం అధికమైనది. ఈ క్రమంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.2 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. మెుత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ లాభం రూ.3,810 కోట్లుగా నిలిచింది.
శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ పవర్ లిమిటెడ్ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో రూ.240.10 వద్ద ఉన్నాయి. ఇదే క్రమంలో టాటా పవర్ కంపెనీ షేర్ విలువ ఎన్ఎస్ఈలో రూ.200 వద్ద ఉంది. ప్రధానంగా దేశంలో పవర్ డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ వినియోగానికి గిరాకీ పెరుగుతోంది. ఇదే సమయంలో కంపెనీలు డిష్ట్రిబ్యూషన్ ఖర్చులను తగ్గించుకుంటూ ముందుకు సాగటం అధిక ఆదాయాలకు కారమంగా నిలుస్తోంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications