IDFC First Bank: ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మిగిలిన బ్యాంకుల మాదిరిగానే కంపెనీ రెండవ త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచింది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రూ.751 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నివేదించిన నికర లాభం రూ.556 కోట్ల కంటే 35 శాతం ఎక్కువ. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన, సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం రూ.746.85 కోట్లుగా ఉంది. ఇది Q2FY23లో కంపెనీ నివేదించిన రూ.567.19 కోట్లతో పోలిస్తే 31.6% పెరిగింది.

అలాగే బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 31 శాతం పెరిగి రూ.3,950 కోట్లుగా నివేదించింది. ఈ క్రమంలోనే కంపెనీ నికర వడ్డీ మార్జిన్ 5.83 శాతం నుంచి 6.32 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ 2023 త్రైమాసికం చివరినాటికి స్థూల నిరర్థక ఆస్తులు రూ.3,747.8 కోట్లుగా ఉన్నాయి. ఇవి Q1 FY24 చివరినాటికి రూ.3,603.4 కోట్లుగా గతంలో ఉన్నాయి. ఏప్రిల్-జూన్ కాలంలో స్థూల GNP నిష్పత్తి 2.17 శాతం నుంచి 2.11 శాతానికి మెరుగుపడింది.
ఈ క్రమంలోనే బ్యాంక్ ఆస్తుల నాణ్యత పెరిగింది. స్థూల ఎన్పీఏలు గత ఏడాది రెంవడ త్రైమాసికంలో 3.18 శాతం నుంచి మెరుగుపడి ప్రస్తుత త్రైమాసికంలో 2.11 శాతానికి చేరుకున్నాయి. అలాగే నికర నిరర్థక ఆస్తులు 1.09 శాతం నుంచి 0.68 శాతానికి మెరుగుపడ్డాయి. ఇక బ్యాంక్ నిర్వహణ వ్యయం ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి రూ.3,870 కోట్లుగా నివేదించబడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications