Bengaluru News: టెక్ రాజధాని బెంగళూరు ప్రస్తుతం సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మారిపోతోంది. బెంగళూరులో ప్రజలు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారో అన్ని ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన డబ్బులు పూర్తిగా అధిక ధరలు, ఇతర గృహ ఖర్చులు మింగేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఐటీ రంగంలో వర్క్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే ఇప్పటికే బెంగళూరులోని అనేక స్కూల్స్ తమ ఫీజులను దాదాపు 10 శాతం నుంచి 30 శాతం మధ్య పెంపును ప్రకటించాయి. ఈ పెంచిన ధరలు 2025-26 అకడమిక్ సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయని సదరు స్కూల్స్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాయి. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్షిక ఫీజు పెంపుదల వెనుక ఉన్న హేతువును ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పటికే బెంగళూరులోని అనేక స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇప్పటికే వచ్చే అకడమిక్ సంవత్సరానికి ఫస్ట్ టర్మ్ ఫీజులను వసూలు చేయటం ప్రారంభించాయి.

దీనికి అనుగుణంగా కొన్ని విద్యా సంస్థలు 10-15 శాతం వార్షిక వేతన పెంపుకు వెళ్లగా మరికొన్ని 15 శాతానికి పైగా పెంపులకు వెళ్లటం ప్రస్తుతం అందరిలోనూ ఆగ్రహానికి దారితీస్తోంది. ఈ క్రమంలో ఒక విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ గడచిన 5 ఏళ్ల కాలంలో తమ పిల్లవాడి స్కూల్ ఫీజు ఏడాదికి రూ.1.20 లక్షల నుంచి రూ.2.1 లక్షలకు పెరిగిందని వెల్లడైంది. వాస్తవానికి చాలా స్కూళ్లు కరోనా కంటే ముందు కేవలం తమ ఫీజులను 10 శాతం మేర పెంపును ప్రకటించాయి. అయితే చాలా సంస్థలు కరోనా తర్వాత ఫీజులను అత్యధికంగా 15-30 శాతం మధ్య పెంపును ప్రకటించాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం బెంగళూరులో విద్యా సంస్థలు స్కూల్ ఫీజుల పెంపును కర్ణాటక ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల సంఘం సమర్థించింది. మార్కెట్లోని ఇతర సంస్థలు ఉద్యోగులను లాక్కునేందుకు ప్రయత్నించటంతో తమ వద్ద ఉన్న స్టాఫ్ వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు ఏటా ఉపాధ్యాయులకు చెల్లించే మెుత్తాలు పెరగటం బోధనా ఖర్చులను పెంచుతోందని వారు చెబుతున్నారు.
ఉత్తర బెంగళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ ఒకరు మాట్లాడుతూ అన్ని రకాల ఫీజుల్లో ఈ ఏకపక్ష పెంపు వింతగా ఉందని అన్నారు.ఇంధన ధర ఏటా 15% పెరుగుతుందా? ఈ రేటు ప్రకారం 10వ తరగతి నాటికి మనం భారీ మొత్తాన్ని చెల్లిస్తాము.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications