Yes Bank: లాభాలతో మైండ్ బ్లాంక్ చేసిన యెస్ బ్యాంక్.. బ్రోకరేజ్ అభిప్రాయం ఇదే..
Q1 Results: ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు తమ మెుదటి క్వార్టర్ రిజల్ట్స్ విడుదల చేస్తున్న వేళ అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా ప్రైవేటు బ్యాకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ నేడు తన జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
ప్రైవేట్ రంగ రుణదాత యెస్ బ్యాంక్ జూలై 20న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర లాభం 47 శాతం పెరిగి రూ.502.43 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం 11.2 శాతం పెరిగింది. ఈ క్రమంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(NPA) నిష్పత్తి జూన్ 30 నాటికి 1.7 శాతంగా ఉంది. ఏడాది కిందట ఇదే సమయంలో నిష్పత్తి 2 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా త్రైమాసిక నికర NPA నిష్పత్తి జూన్ 30 నాటికి 0.5 శాతానికి క్షీణించింది.

మెుదటి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ ఆదాయం 17.59 శాతం పెరిగి రూ.8,918.14 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం వార్షిక ప్రాతిపధికన 20.5 శాతం పెరిగి రూ.1,199 కోట్లుగా నిలిచింది. నికర కేటాయింపు ఖర్చులు సంవత్సరానికి 41.2 శాతం తగ్గాయి. అలాగే ఆస్తిపై రాబడి(RoA) Q1లో 0.5 శాతం వద్ద ఉంది. కంపెనీ తాజా ఆర్థిక ఫలితాలపై YES బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఏడాదిని కంపెనీ బలమైన రాబడులతో ప్రారంభించిందని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో బ్యాంక్ నిర్వహణ వ్యయాలను 8 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది.
తొలి త్రైమాసికంలో రిటైల్, బ్రాంచ్ బ్యాంకింగ్ నేతృత్వంలోని డిపాజిట్లు హోల్‌సేల్ డిపాజిట్ల కంటే వేగంగా పెరుగుతూనే ఉన్నాయని సీఈవో ప్రశాంత్ పేర్కొన్నారు. అలాగే ప్రొవిజన్స్ అండ్ కన్టిన్జన్సీస్ 41 శాతం తగ్గగా, రుణాలు 14.7 శాతం పెరిగాయని బ్యాంక్ పేర్కొంది. శుక్రవారం యెస్ బ్యాంక్ షేర్ ధర 3.80 శాతం క్షీణతతో రూ.24.78 వద్ద స్థిరపడ్డాయి. అయితే 2024లో కంపెనీ షేర్లు ఇప్పటి వరకు దాదాపు 9.45 శాతం లాభపడి ఇన్వెస్టర్లకు సూపర్ రాబడిని అందించాయి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ జూలై 2024లో రేటింగ్ ఔట్‌లుక్‌ను 'స్టేబుల్' నుంచి 'పాజిటివ్'కి అప్‌గ్రేడ్ చేసింది. అలాగే ICRA కూడా బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను A- నుంచి Aకి అప్‌గ్రేడ్ చేసింది.


Click it and Unblock the Notifications