Yes Bank Q3 Results: వరుసగా ఈ నెలలో కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను విడుల చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక స్టాక్స్ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోవటంలో నిరాశకు గురిచేస్తుండటంతో మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
అయితే ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలోని యెస్ బ్యాంక్ శనివారం నాడు తన క్యూ3 త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన కాలంలో కంపెనీ నికర లాభం రూ.231.6 కోట్లుగా నిలిచింది. ఇది గత ఏడాది క్యూ3లో నమోదైన రూ.51.5 కోట్ల కంటే 349.7 శాతం అధికం కావటం గమనార్హం. అలాగే నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.4 శాతం పెరిగి రూ.2,017 కోట్లుగా నమోదైంది.

ఇదే క్రమంలో కంపెనీ నికర నిరర్థక ఆస్తుల గత ఏడాది మాదిరిగానే 2 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబరు త్రైమాసికంలో యెస్ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు రూ.4,319 కోట్ల నుంచి రూ.4,457 కోట్లకు.. నికర ఎన్‌పీఏ వరుసగా రూ.1,885 కోట్ల నుంచి రూ.1,934 కోట్లకు పెరిగాయి. కంపెనీ లాభాలు పెరగటంలో తగ్గిన ప్రొవిజన్స్ ఒక కారణంగా తెలుస్తోంది.
కంపెనీ నికర అడ్వాన్సులు ఏడాది ప్రాతిపదికన 11.8 శాతం పెరిగి రూ.2,17,523 కోట్లుగా నిలిచాయి. ప్రస్తుత ఫలితాలు విశ్లేషకుల అంచనాల కంటే సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఎంకే గ్లోబల్ యెస్ బ్యాంక్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.51.50 కోట్ల నుంచి రూ.415.10 కోట్ల నికర లాభంలో 706 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది.
అలాగే ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కూడా 876 శాతం వృద్ధితో రూ.503 కోట్ల లాభం వస్తుందని అంచనా వేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 25 శాతం పెరిగి రూ.7,921 కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయంలో యెస్ బ్యాంక్ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.24.85గా ఉంది.


Click it and Unblock the Notifications