Yes Bank Layoffs: ప్రస్తుతం భారతదేశంలోని బ్యాంకింగ్ కంపెనీలు అత్యుత్తమ వ్యాపార లాభాలను ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యెస్ బ్యాంక్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రైవేట్ రుణదాత యెస్ బ్యాంక్ పునర్నిర్మాణ ప్రక్రియలో వందలాది మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తుందనే వార్త మార్కెట్లో పెద్ద అలజడిని సృష్టిస్తోంది. ఈ తొలగింపులు హోల్‌సేల్ నుంచి రిటైల్ వరకు అన్ని విభాగాల్లో జరిగినట్లు వెల్లడైంది. అలాగే బ్రాంచ్ బ్యాంకింగ్ విభాగంలోని అనేక విభాగాల్లో తొలగింపులు జరిగాయని వెల్లడైంది. ఒకపక్క అనేక బ్యాంకులు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తూ వేగంగా విస్తరిస్తుంటే యెస్ బ్యాంక్ మాత్రం ఉద్యోగుల తొలగింపులకు వెళ్లటంపై ఇటు కంపెనీ ఇన్వెస్టర్లలోనూ ఆందోళనలను రేకెత్తిస్తోంది.

తాజా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో యెస్ బ్యాంక్ కనీసం 500 మంది ఉద్యోగులను తొలగించిందని తేలింది. అలాగే రానున్న రోజుల్లో సైతం ఇలాంటి మరిన్ని తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది. తొలగింపునకు గురైన ఉద్యోగులకు మూడు నెలల జీతాన్ని బ్యాంక్ ఆఫర్ చేసినట్లు వెల్లడైంది. వర్క్‌ఫోర్స్‌ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా కార్యాచరణను సమర్థంగా మార్చాలని చూస్తున్నట్లు కంపెనీకి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. బహుళజాతి కన్సల్టెంట్ సలహా మేరకు తాజా తొలగింపులు జరిగాయని సమాచారం. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.75,268 కోట్లుగా ఉంది.
చురుకైన, వేగవంతమైన, కస్టమర్ సెంట్రిక్, కార్యాచరణలో సమర్థవంతమైన సంస్థగా నిలిచేందుకు కొనసాగుతున్న ప్రక్రియలో భాగంగా వర్క్‌ఫోర్స్ ఆప్టిమైజేషన్ జరుగుతోందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలో బ్యాంక్ ఎక్కువగా డిజిటల్ బ్యాంకింగ్ వైపు మెుగ్గుచూపుతూ.. మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ సిబ్బంది ఖర్చులు 12 శాతం పెరగటం కూడా తాజా చర్యలకు దారితీసిందని తెలుస్తోంది. బ్యాంక్ ఖర్చులు FY23 చివరి నాటికి రూ.3,363 కోట్ల నుంచి FY24 చివరి నాటికి రూ.3,774 కోట్లకు పెరిగాయి. ఉదయం 10.19 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ధర స్వల్పంగా లాభపడి రూ.24.06 వద్ద కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications