Axis Bank Q3 Results: ఈరోజు స్టాక్ మార్కెట్లలో బ్యాంక్ నిఫ్టీ సూచీ భారీ నష్టాలను నమోదు చేసింది. ఈ క్రమంలో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ సైతం కూడా ప్రతికూలంగా పడటంతో నష్టాల్లోనే ప్రయాణాన్ని ముగించింది.
డిసెంబరుతో ముగిసిన మూడవ త్రైమాసికంలో ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన తన ఆర్థిక ఫలితాలను నేడు విడుదల చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఆదాయం 4 శాతం మేర వృద్ధి చెంది రూ.6,071 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం కేవలం రూ.5,853 కోట్లుగా ఉన్నట్లు ఉంది. అలాగే తాజా త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.22,226 కోట్ల నుంచి రూ.27,961 కోట్లకు పెరిగింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.33,516 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడైంది. డిసెంబర్ 31, 2023 నాటికి స్థూల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్(NPA) నిష్పత్తి 1.58 శాతానికి మెరుగుపడింది. క్రితం సంవత్సరం వ్యవధిలో ఇది 2.38 శాతంగా ఉంది. డిసెంబర్ 2022 చివరినాటికి 0.47 శాతంతో పోలిస్తే నికర NPA 0.36 శాతానికి తగ్గింది.
2023 డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ దాని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల (AIFలు)లో పెట్టుబడులకు సంబంధించి రూ.181.70 కోట్ల కేటాయింపులు చేసింది. రిజర్వు బ్యాంక్ ఆదేశాలకు అనుగుణంగా ఇది జరిగింది. డిసెంబర్ క్వార్టర్ లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ.12,532 కోట్లకు చేరుకోగా.. నికర మార్జిన్ 4.01 శాతంగా నమోదైంది.


Click it and Unblock the Notifications