Axis Bank: ఈ వారం ప్రారంభంలో ఎఫ్డీ వడ్డీ రేట్లను ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా పెంచింది. ఇదే క్రమంలో తాజాగా యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో రిజర్వు బ్యాంక్ ఎంపీసీ మీటింగ్ తర్వాత రేట్లు పెరగనున్న తరుణంలో దిగ్గజ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

రేట్ల పెంపు ప్రకటన..
ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. తాజాగా పెరిగిన రేట్లు సెప్టెంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన FD రేట్లు ఇప్పుడు సాధారణ పౌరులకు 2.75 శాతం నుంచి 5.75 శాతం మధ్య ఉండగా.. సీనియర్ సిటిజన్లకు రేట్లు 2.75 శాతం నుంచి 6.50 శాతం వరకు ఉన్నాయి.

కొత్త రేట్లు ఇలా..
సెప్టెంబర్ 20, 2022 నుంచి యాక్సిస్ బ్యాంక్‌లో రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతంగా ఉంది. 30 రోజుల నుంచి 3 నెలల కారిమితి వరకు సాధారణ ప్రజలకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం వడ్డీ రేటును ప్రకటించింది.

3 నెలల నుంచి ఏడాది లోపు..
మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు 3.75 శాతం ఉండగా..సీనియర్ సిటిజన్లకు సైతం ఇదే రేటును బ్యాంక్ అందిస్తోంది. ఇదే క్రమంలో ఆరు నెలల నుంచి ఏడాది లోపు కాలానికి సాధారణ ప్రజలకు 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం వడ్డీ రేటును బ్యాంక్ ప్రకటించింది.

ఏడాది పైన కాలానికి..
1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 11 రోజులు: సాధారణ ప్రజలకు 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.20 శాతం
1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 25 రోజులు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
1 సంవత్సరం 25 రోజుల నుంచి 13 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం
13 నెలల నుంచి 14 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం
14 నెలల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం
15 నెలల నుంచి 16 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం
16 నెలల నుంచి 17 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం
17 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం
18 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం
2 సంవత్సరాల నుంచి 30 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం
30 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.45 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications