helicopters demand: ప్రైవేట్ జెట్స్, హెలీకాఫ్టర్లకు మస్తు డిమాండ్.. ఎంత ఖర్చు అవుతుందంటే..
Gneral Elections: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీలు సహా పార్లమెంటుకు కూడా ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. దీంతో బ్యానర్ల దగ్గర నుంచి ప్రచారం వరకు ఖర్చు పెట్టుకునేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో వారికి షాక్ ఇస్తూ హెలికాఫ్టర్ల రేట్లు భారీగా పెరిగాయి. ఎన్నికలకు, హెలికాఫ్టర్లకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చార్టెర్డ్ విమానాలు, హెలికాప్టర్ల డిమాండ్ 40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వీటి ద్వారా మారుమూల గ్రామాలకు కూడా తక్కువ సమయంలో వెళ్లే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఎక్కువగా హెలీకాఫ్టర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే అగ్రిమెంట్లు సైతం గుర్తుంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు గంటల ప్రాతిపదికన ఛార్జీలను లెక్కిస్తారు. చార్టర్డ్ విమానం కోసం ధర 4.5 లక్షలు నుంచి 5.2 లక్షల మధ్య మారుతూ ఉంటుంది. ఇక హెలికాఫ్టర్ కు 1.5 లక్షలు ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ 2023 చివరి నాటికి 112 నాన్ షెడ్యూల్ ఆపరేటర్లు ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక డేటా చెబుతోంది. వీరిలో దాదాపు సగభాగం ఒకే తరహా విమానాలను నిర్వహిస్తున్నారు.
ఎన్నికలలో చాపర్లతో సహా 450 విమానాలు ఉంటాయని భావిస్తున్నట్లు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ MD కెప్టెన్ ఆర్కే బాలి తెలిపారు. సీటింగ్ కెపాసిటీ 3 నుంచి 37 వరకు ఉంటాయన్నారు. 10 కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ కరిగిన హెలికాప్టర్లు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. 2019-20లో ఈ తరహా ప్రయాణం ఖర్చుల కోసం కాంగ్రెస్ పార్టీ చెల్లించిన మొత్తం 126 కోట్లకు పైమాటే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications