Airtel News: ప్రస్తుతం భారతదేశంలోని టెలికాం రంగంలో భారీ పోటీని తట్టుకుని నిలబడిన కంపెనీగా ఎయిర్ టెల్ నిలిచింది. ఇప్పటికే ఈ వ్యాపారంలో రిలయన్స్ జియో భారీ పెట్టుబడులతో మార్కెట్ వాటాను సైతం దక్కించుకుంది.
తాజాగా ఎయిర్‌టెల్ సంస్థకు పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి సంస్థ కార్లైల్ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ డేటా సెంటర్ యూనిట్ అయిన Nxtra డేటా లిమిటెడ్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యాపారంలో తనకున్న మెుత్తం 24 శాతం వాటాలను విక్రయించాలని చూస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి వెల్లడించారు.

వాస్తవానికి కార్లైల్ 2020లో Nxtraలో సుమారు రూ.1,780 కోట్లకు వాటాను కొనుగోలు చేసింది. Nxtraలో తమ వాటా కోసం కొన్ని ఇన్‌బౌండ్ అభ్యర్థనలను ఈక్విటీ ఇన్వెస్టర్ అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ పెట్టిన మెుత్తం డబ్బు బాగా వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడైంది. అయితే ఈ విషయంపై అటు కార్లైల్ లేదా ఇటు భారతీ ఎయిర్‌టెల్ కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే ఈ వార్తల నేపథ్యంలో కంపెనీ షేర్లు స్వల్పంగా ఊగిసలాడుతూ ఉదయం 10.17 గంటల సమయంలో రూ.1112.40 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
మార్చి 31, 2023 నాటికి Nxtra కంపెనీకి ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, భువనేశ్వర్‌లలో రెండు హైపర్-స్కేల్ డేటా సెంటర్‌లు, 10 ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ డేటా సెంటర్‌లను కలిగి ఉంది. అలాగే భారతదేశం అంతటా 120 కంటే ఎక్కువ ఎడ్జ్ డేటా సెంటర్‌లను కలిగి ఉంది. గడచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయం 13 శాతం వేగంగా వృద్ధి చెంది 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.852 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.1,601 కోట్లకు చేరుకుంది. Nxtra మాతృ సంస్థ ఎయిర్‌టెల్‌తో బలమైన లింక్‌లను కలిగి ఉందని రేటింగ్ ఏజెన్సీ కేర్ వెల్లడించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications