రిలయన్స్, బ్యాంకులు లాభాలు తెచ్చాయి! ఆ ప్రభుత్వాల ఎఫెక్ట్.. పీవీఆర్, రెస్టారెంట్ అదుర్స్

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 28) భారీ లాభాల్లో ముగిశాయి. గత గురువారం వరకు వరుసగా ఆరు సెషన్‌లలో 2,750 పాయింట్ల మేర నష్టపోయిన సెన్సెక్స్ శుక్రవారం 800 పాయింట్లకు పైగా లాభపడింది. ఈ రోజు ఆ లాభాలను కొనసాగిస్తూ, దాదాపు 600 పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్ 592.97 పాయింట్లు (1.59%) లాభపడి 37,981.63 వద్ద, నిఫ్టీ 177.20 పాయింట్లు (1.60%) ఎగిసి 11,227.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1,888 షేర్లు లాభాల్లో, 763 షేర్లు నష్టాల్లో, 158 షేర్లలో ఎలాంటి మార్పు లేకుండా ముగిసింది.

బ్యాంకింగ్, మెటల్, ఆటో అదుర్స్

బ్యాంకింగ్, మెటల్, ఆటో అదుర్స్

- అన్ని రంగాలు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో సూచీలు 3 శాతం చొప్పున లాభపడ్డాయి.

- బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 2 శాతం మేర ఎగిశాయి.

- టాప్ గెయినర్స్ జాబితాలో ఇండస్ ఇండ్ బ్యాంకు (7.82), బజాజ్ ఫైనాన్స్ (6.25), యాక్సిస్ బ్యాంకు (5.83), పవర్ గ్రిడ్ కార్పోరేషన్ (4.60), టాటా మోటార్స్ (4.40) ఉన్నాయి.

- టాప్ లూజర్స్ జాబితాలో HUL (-0.76), విప్రో (-0.75), నెస్ట్లే (-0.11), ఇన్ఫోసిస్ (-0.10) ఉన్నాయి.

- నిఫ్టీ 4 సెషన్ల అనంతరం 11,200 దాటింది.

- మిడ్ క్యాప్ 494 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 683 పాయింట్లు ఎగిసింది.

- 46 నిఫ్టీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. టాప్ 5 గెయినర్స్‌లో రెండు బ్యాంకింగ్ రంగం నుండి ఉన్నాయి.

మార్కెట్ లాభాలకు కారణాలు..

మార్కెట్ లాభాలకు కారణాలు..

- అంతర్జాతీయ మార్కెట్ల భారీ లాభాల్లో ఉండటంతో ఈ ప్రభావం ఆసియా, దేశీయ మార్కెట్‌పై పడింది.

- అమెరికా ప్యాకేజీపై దాదాపు క్లారిటీ రావడంతో అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇది మన మార్కెట్లపై ప్రభావం చూపింది.

- రిలయన్స్ (0.74 శాతం), యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ వంటి ఫ్రంట్ లైన్ సూచీలు సెన్సెక్స్ భారీ లాభాలకు కారణమయ్యాయి.

- 78 పాయింట్లతో ఫైనాన్షియల్ స్టాక్స్ నిప్టీకి భారీ లాభాలు తెచ్చాయి. ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, HDFC బ్యాంకు, HDFC ఉన్నాయి.

- లోన్ మారటోరియం వడ్డీ రేటు మాఫీకి సంబంధించి ప్రభుత్వం సుప్రీం కోర్టును మరింత సమయం కోరింది. దీంతో నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ అన్నీ లాభాల్లో ముగిశాయి.

- వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడానికి అనుమతించింది. దీంతో పీవీఆర్, ఐనోక్స్ లీజర్ స్టాక్స్ పుంజుకున్నాయి. పీవీఆర్ షేర్లు 12 శాతం దూసుకెళ్లాయి.

- మహారాష్ట్ర ప్రభుత్వం డైన్-ఇన్ సర్వీస్‌లకు అనుమతి ఇవ్వడంతో స్పెషాలిటీ రెస్టారెంట్స్ స్టాక్స్ 10 శాతం మేర ఎగిశాయి.

- హార్లే డేవిడ్సన్‌తో చర్చల నేపథ్యంలో హీరో మోటో కార్ప్ 3 శాతం లాభపడింది.

- ఆటో సేల్స్ క్రమంగా పుంజుకోవడంతో ఆటో రంగం కూడా పుంజుకుంది. టాటా మోటార్స్, ఎస్కార్ట్ లాభపడ్డాయి.

- ఆటో రికవరీ నేపథ్యంలో టైర్ల కంపెనీల షేర్లు కూడా పుంజుకున్నాయి. అపోలో టైర్స్, బాల్‌క్రిష్ణ ఇండస్ట్రీస్ 7 శాతం చొప్పున లాభపడ్డాయి.

బలహీనపడిన రూపాయి

బలహీనపడిన రూపాయి

డాలర్ మారకంతో రూపాయి 17 పైసలు క్షీణించి 73.78 వద్ద క్లోజ్ అయింది. ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లుకు మొగ్గు చూపారు. ఉదయం రూపాయి 73.67 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం 73.61 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 73.53-73.85. మధ్య ట్రేడ్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+