ICICI Bank: దేశంలోని బ్యాంకింగ్ సంస్థలు వరుసగా తమ ఆర్థిక ఫలితాలను ఒకటి తర్వాత మరొకటి విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఊహించని లాభాలను నమోదు చేస్తుండగా.. మరికొన్ని మాత్రం లాభాలు తలకిందులవ్వటంతో భారీగా క్షీణతను చూస్తున్నాయి.
ఈ క్రమంలో శనివారం తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజ ఐసీఐసీఐ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికాలకు తన ఫలితాలను విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.10,707 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది గత ఏడాది మార్చి త్రైమాసికంలో నమోదు చేసిన రూ.9,122 కోట్ల లాభం కంటే 17 శాతం అధికం. దీంతో బ్యాంక్ షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లలో కోలాహలం కొనసాగుతోంది. వాస్తవానికి నేడు విడుదలైన ఫలితాలు మార్కెట్ అంచనాలను అధిగమించాయి.

దీంతో కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.10 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఇక పనితీరును గమనిస్తే.. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ.19,093 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.17,667 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.16 శాతంగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 2.81 శాతం నుంచి తగ్గింది. మరోవైపు త్రైమాసికంలో నికర ఎన్‌పీఏలు గత ఏడాది 0.48 శాతంతో పోలిస్తే 0.42 శాతానికి తగ్గాయి. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ధర రూ.1,107.15 వద్ద ముగిసింది.
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం తన ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(AIF) నుంచి సుమారు రూ.100 కోట్లను తిరిగి తీసుకున్నట్లు బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనింద్యా బెనర్జీ తెలిపారు. AIFలకు మరిన్ని పెట్టుబడులపై బ్యాంకుకు ఇప్పుడు పెట్టుబడులకు ఎలాంటి ప్రణాళికలు లేవని బెనర్జీ చెప్పారు. ఇంతకుముందు రుణదాత తన AIF పెట్టుబడులపై రూ.627 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ అంచనాలకు మించి పనితీరును క్యూ4లో కనబరచటంతో సోమవారం మార్కెట్లు తెరుచుకోగానే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లపై కొనుగోళ్లకు దాడిచేసే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications