Axis Bank Q4 Results: దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నేడు తన మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. గత ఏడాది ఇదే సమయంలో భారీ నష్టాలను నమోదు చేసిన కంపెనీ ఇప్పుడు కళ్లు చెదిరే లాభాలను పోస్ట్ చేసింది.
మార్కెట్లు ముగిసిన తర్వాత ఫలితాలను ప్రకటించిన యాక్సిస్ బ్యాంక్ నాలుగో త్రైమాసికంలో రూ.7,130 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.5,762 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అప్పుడు కంపెనీ సిటి బ్యాంక్ ఇండియా కన్జూమర్ వ్యాపారాన్ని కొనుగోలు చేయటంతో నష్టాలను నమోదు చేసింది. ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ నికర వడ్డీ ఆదాయం 11.47 శాతం పెరిగి రూ.13,089 కోట్లుగా నమోదైంది. ఇది బ్యాంక్ సంపాదించిన వడ్డీ ఆదాయానికి డిపాజిటర్లకు చెల్లించే వడ్డీకి మధ్య వత్యాసం.

బ్యాంక్ NPAలు 1.43 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 2.02 శాతం తగ్గింది. నికర ఎన్‌పీఏలు గతంలో ఉన్న 0.39 శాతంతో పోలిస్తే 0.31 శాతానికి తగ్గాయి. ఇదే క్రమంలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.1 డివిడెండ్ రూపంలో చెల్లించాలని బోర్డు సిఫార్సు చేసింది.
Q4FY24 కోసం కేటాయింపులు, ఆకస్మిక పరిస్థితులు రూ.1,185 కోట్లు, నిర్దిష్ట రుణ నష్టాల కేటాయింపులు రూ.832 కోట్లుగా ఉన్నాయి. నేడు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ ధర 0.72 శాతం పెరిగి రూ.1,064.05 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications