Q3 Results: లాభాలతో దుమ్మురేపిన బ్యాంకింగ్ స్టాక్.. 12 శాతం పెరిగిన స్టాక్..
Karur Vysya Bank: దేశంలోని కార్పొరేట్ కంపెనీలు ప్రస్తుతం ప్రకటిస్తున్న క్యూ3 ఫలితాలపై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకింగ్ స్టాక్స్ అద్భుతమైన పనితీరును కనబరిచాయి.
కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు నేడు మార్కెట్లు 12% పెరిగాయి. ఈ క్రమంలో స్టాక్ తన సరికొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.188.55 స్థాయికి చేరుకుంది. అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలానికి ప్రైవేట్ బ్యాంకర్ కరూర్ వైశ్యా బ్యాంక్ నికర లాభం 42.56 శాతం పెరిగి రూ.412 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.289 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 31, 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి బ్యాంక్ నికర లాభం రూ.1,149 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 49.61 శాతం అధికం. డిసెంబరుతో ముగిసిన తాజా త్రైమాసికంలో మెుత్తం ఆదాయం రూ.2,497.17 కోట్లకు పెరిగింది. త్రైమాసికంలో నికర NPA అడ్వాన్స్‌ల్లో 0.42 శాతంగా ఉంది. అంటే డిసెంబర్ 31, 2023 నాటికి రూ. 305 కోట్లు.
కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు ప్రస్తుతం రూ.186 వద్ద ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.48 గంటల సమయానికి ఎన్ఎస్ఈలో స్టాక్ ధర 8.01% లాభపడి రూ.183.30 వద్ద కొనసాగుతోంది. బ్యాంక్ అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించటంతో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్లు చెపడుతున్నారు. గడచిన నెలరోజుల్లో స్టాక్ పనితీరును గమనిస్తే 13.73% వృద్ధి చెందింది. ఆరు నెలల కాలంలో స్టాక్ 43 శాతానికి పైగా రాబడిని అందించింది. ఏడాది కాలంలో 71 శాతం, ఐదేళ్ల కాలంలో స్టాక్ ఏకంగా 102 శాతానికి పైగా రాబడిని అందించింది. ప్రస్తుతం బ్యాంక్ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.14,740 కోట్లుగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications