IDFC First Bank: సోమవారం కుప్పకూలనున్న ఐడీఎఫ్‌సీ స్టాక్.. తలకిందులైన లాభాలు
Q4 Results: దేశీయ బ్యాంకింగ్ కంపెనీలు వరుసగా తమ మార్చి త్రైమాసిక ఫలితాలను ఒకటి తర్వాత మరొకటి ప్రకటిస్తూనే ఉన్నాయి. గడచిన వారంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్ వంటి దిగ్గజాలు ఇప్పటికే తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన మరో సంస్థ ఐడీఎఫ్‌సీ తన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. శనివారం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అయితే చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏకంగా 10 శాతం క్షీణించి రూ.724 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.803 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనికి కారణంగా కంపెనీ తన ప్రొవిజన్స్ పెరగటమేనని పేర్కొంది.

కంపెనీ మెుత్తం ఆదాయం రూ.9,861 కోట్లుగా ఉన్నట్లు నివేదించింది. గత ఏడాది ఇది రూ.7,822 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది. జనవరి-మార్చి త్రైమాసికంలో తన వడ్డీ ఆదాయం రూ.8,219 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వడ్డీ ఆదాయం రూ.6,424 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 24 శాతం పెరిగి రూ.4,469 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో నికర నిరర్థక ఆస్తులు గతంలో ఉన్న 0.86 శాతం నుంచి ప్రస్తుత త్రైమాసికంలో 0.60 శాతానికి క్షీణించాయని వెల్లడైంది.
దీనికి తోడు ఈ నెల ప్రారంభంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ పై ఏకంగా రూ. కోటి పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. లోన్స్ అండ్ అడ్వాన్సుల నిబంధనల విషయంలో జరిగిన లోపాలపై సెంట్రల్ బ్యాంక్ చర్యలతో జరిమానా విధించబడిందని వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే.. ఆర్‌బీఐ ప్రకారం ప్రాజెక్ట్‌ల నుంచి వచ్చే ఆదాయ మార్గాలు రుణ సేవలను చూసుకోవడానికి సరిపోతాయని నిర్ధారించడానికి ప్రాజెక్ట్‌ల సాధ్యత, బ్యాంకింగ్‌పై తగిన శ్రద్ధ తీసుకోకుండా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ కోసం ప్రభుత్వ రంగ సంస్థకు బ్యాంకు టర్మ్ లోన్‌లను మంజూరు చేసింది. ఈ రుణాల విషయంలో రూల్స్ పాటించనందుకు బ్యాంక్ పెనాల్టీని ఎదుర్కొంది.


Click it and Unblock the Notifications