Bengaluru Pink Line Metro: రేపే బెంగళూరు పింక్ లైన్ మెట్రో ప్రారంభం..!
బెంగళూరు పింక్ మెట్రో లైన్ రేపటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తావరకెరె నుంచి కాలేన అగ్రహారం వరకు ఉన్న నమ్మ మెట్రో 7.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ పింక్ లైన్‌ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అయితే బన్నేరుఘట్ట రోడ్డు వెంబడి అధ్వాన్నమైన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, చివరి మైలు కనెక్టివిటీ ఆందోళన కలిగిస్తున్నాయి. లక్కసంద్ర నుంచి కాలేన అగ్రహారం వరకు ఈ కారిడార్ లో సరిగా పనులు పూర్తి కాలేదు. తావరకెరె, ఐఐఎంబీ స్టేషన్ల మధ్య మౌలిక సదుపాయాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఐఐఎంబీ దాటిన తర్వాత, దెబ్బతిన్న రోడ్లు, సరిపోని పాదచారుల సౌకర్యాలు ప్రయాణాన్ని కష్టతరం చేస్తున్నాయి.
సెప్టెంబరు నెలలోనే తాము దెబ్బతిన్న, ఎగుడుదిగుడుగా ఉన్న ఫుట్‌పాత్‌లు మరియు చెత్తాచెదారం పేరుకుపోయే ప్రదేశాలను సరిచేయడం ప్రారంభించామని ప్రాజెక్ట్ వాకలూరు కోఆర్డినేటర్ మరియు జీబీఏ బ్రాండ్ అంబాసిడర్ అరుణ్ పాయ్ చెప్పారు. పింక్ లైన్ ప్రారంభానికి ముందే చాలా సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. బెంగళూరు సౌత్ సిటీ కార్పొరేషన్ దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లు, గుంతలతో సహా 160 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించింది. గత రెండు నెలల్లో దాదాపు 150 సమస్యలను పరిష్కరించినట్లు చెబుతున్నారు. జెపి నగర్ 4వ ఫేజ్ స్టేషన్ వద్ద, జెడి మారా అనధికార నివాస ప్రాంతం సమీపంలోని ఫుట్‌పాత్‌లను మెరుగుపరిచారు.

అయితే దానికి ఎదురుగా ఉన్నవి మాత్రం ఎగుడుదిగుడుగా ఉన్నాయి. హులిమావు స్టేషన్‌కు వెళ్లే ఫుట్‌పాత్‌ను ఒక మురుగు కాలువ అడ్డుకుంటుంది. భూసేకరణ కారణంగా తావరకెరె స్టేషన్‌కు ప్రవేశ మార్గం అసంపూర్తిగా మిగిలిపోయింది. సరిపోని వీధి దీపాలు, అనుసంధాన రహదారులపై గుంతలు ప్రయాణికుల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. ఆరెకెరె, హులిమావులలో, ఇరుకైన రోడ్లు, ఆక్రమణలు,రోడ్డు పక్కన పార్కింగ్ కారణంగా రద్దీ ఏర్పడుతోంది. కొద్ది దూరం నడవడం కూడా కష్టంగా ఉంది. ముఖ్యంగా వృద్ధులకు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చివరి మైలు కనెక్టివిటీ ఒక సవాలుగా మిగిలిపోయింది.
కాగా.. బెంగళూరు మెట్రో ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 84% భారాన్ని కర్ణాటక రాష్ట్రమే మోస్తోందని, కేంద్రం కేవలం 16% మాత్రమే సమకూరుస్తోందని గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆర్థిక వనరులను అందించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications