Gold: బంగారం కొనుగోలు చేయకండి.. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు..
దేశ ప్రజలకు ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. జీడీపీ వృద్ధి రేటు అద్భుతంగా 7.8% నమోదైన సందర్భంలో 'స్వదేశీ' మంత్రాన్ని జపించాలని కోరారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ వివాహాలు మానుకోవాలని కోరారు. భారతీయులకు అత్యంత ఇష్టమైన బంగారం కొనుగోళ్లపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యవసరం అయితే తప్ప బంగారం కొనుగోలు చేయకూడదని కోరారు. అయితే ప్రధాని పిలుపునకు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం మన దేశం ఎదుర్కొంటున్న వాణిజ్య లోటేనని నిపుణులు చెబుతున్నారు. తాజాగా జూలై నెలలో భారత గోల్డ్ దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగి ఏకంగా 4.16 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
భారతీయ కరెన్సీలో రూ.39వేల 520 కోట్లకు చేరాయి. దీనివల్ల మన దేశ వస్తువుల వాణిజ్య లోటు గత 6 నెలల గరిష్ట స్థాయి అయిన 31.98 బిలియన్ డాలర్లకు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ.3లక్షల 3వేల 810 కోట్లకు పెరిగింది. విదేశాల నుంచి మనం బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ బయటకు తరలిపోతున్నాయని, అందుకే ప్రధాని బంగారం కొనుగోలు ఆపాలని ప్రధాని కోరుతున్నట్లు చెబుతున్నారు. కేవలం ఒక్క నెలలో బంగారం కోసమే దాదాపు రూ. 40 వేల కోట్లు విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని భారతదేశం కోల్పోతోంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సర కాలంలో పసిడి ధర భారీగా పెరిగింది. తాజాగా మంగళవారం కూడా పుత్తడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి రూ.1,56,930 వద్ద నమోదయింది. తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,43,850 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,17,730కి చేరింది. బంగారం పెరగడం.. ధర పెరిగినా కూడా పసిడి కొనుగోలు చేయడానికి ప్రజలు ముందు రావడంతో విదేశీ మారక ద్రవ్యం భారీగా కోల్పోయే పరిస్థితి వస్తోంది. అయితే బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఒక వేళ బంగారం ధర పెరిగి, భారతీయులు బంగారం ఇంకా కొనుగోలు చేస్తే భారీగా మారక ద్రవ్యం కోల్పోవాల్సి వస్తోంది. భారత్ బంగారంతో పాటు ముడి చమురును కూడా భారీగా దిగుమతి చేసుకుంటుంది. దీని కోసం కూడా భారీగా విదేశీ మారకద్రవ్యం కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని కేంద్రం కోరుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications