Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. ఈ వారంలోనే మరో వందే భారత్ రైలు ప్రారంభం..!
బెంగళూరు వాసులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. బెంగళూరు, మడ్గావ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ వారం రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రైల్వే మంత్రిత్వ శాఖ నవంబర్ 13న బెంగళూరు, మడ్గావ్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సెమీ-హై-స్పీడ్ రైలు కర్ణాటక, గోవా మరియు తీరప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. రైల్వే బోర్డు అక్టోబర్ 30, 2026న ఈ రైలుకు ఆమోదం తెలిపింది. బెంగళూరు-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 13 శుక్రవారం ప్రారంభించే అవకాశం ఉందని అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు ఓ ఆంగ్ల వెబ్ సైట్ పేర్కొంది.
ఈ వందే భారత్ రైలున చెన్నై ఆధారిత ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతికతను ఉపయోగించి BEML అభివృద్ధి చేసింది. ఈ ప్రీమియం రైలు మంగళూరు జంక్షన్ మీదుగా యశ్వంత్‌పూర్, మడ్‌గావ్ మధ్య నడుస్తుంది. యశ్వంత్‌పూర్-మడ్‌గావ్-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్లు 26655, 26656గా నడవనుంది. దాదాపు 13 గంటల 20 నిమిషాల ప్రయాణాన్ని పూర్తి చేయనుంది. యశ్వంత్‌పూర్, మడ్‌గావ్ మధ్య ప్రయాణంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 12 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. శ్రావణబెళగొళ, హసన్, సకలేష్‌పూర్, సుబ్రహ్మణ్య రోడ్, కబక పుత్తూరు, మంగళూరు జంక్షన్, ఉడిపి, కుందాపుర, మూకాంబికా రోడ్ బైందూర్, ముర్డేశ్వర్, గోకర్ణ రోడ్, కార్వార్ ఈ ట్రైన్ ఆగనుంది.

రైలు నంబర్ 26655 యశ్వంత్‌పూర్-మడ్‌గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యశ్వంత్‌పూర్ నుంచి 07:35 గంటలకు బయలుదేరి 20:55 గంటలకు మడ్‌గావ్ చేరుకుంటుంది. ఈ రైలు బుధవారాలు మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 26656 మడ్గావ్-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మడ్గావ్ నుంచి 08:20 గంటలకు బయలుదేరి 21:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఇది గురువారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. కొద్ది రోజుల క్రితమే బెంగళూరు, ముంబై మధ్ వందే భారత్ స్లీపర్ రైలును రైల్వే శాఖ ప్రారంభించింది. ఈ ట్రైన్ నవంబర్ 3న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
వందే భారత్ స్లీపర్ రైళ్లు వారానికి ఆరు రోజులు నడుస్తున్నాయి. బెంగళూరు-ముంబై సర్వీసు సోమవారాల్లో ముంబై-బెంగళూరు సర్వీసు మంగళవారాల్లో నడవవు. బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ దాదాపు 16 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. రైల్వే టైమ్ టేబుల్ ప్రకారం రైలు నంబర్ 27652 సాయంత్రం 7:45 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు CSMT ముంబైకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 27651 రాత్రి 8:10 గంటలకు CSMT ముంబై నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు SMVT బెంగళూరుకు చేరుకుంటుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications