Bengaluru News: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. గోవాకు వందే భారత్ రైలు..!
బెంగళూరు-గోవా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శుక్రవార ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం డీకే శివకుమార్ కలిసి ప్రారంభించారు. బెంగళూరు, మంగళూరు, మార్గావ్ (గోవా) నగరాల మధ్య ఈ రైలు కనెక్టివిటీని పెంచనుంది. ఈ కొత్త వందే భారత్ సర్వీసు విద్యుదీకరించిన మార్గంలో నడుస్తుంది. దీనివల్ల డీజిల్ ఇంధనంపై ఆధారపడటం తగ్గుతుంది. బెంగళూరు, తీరప్రాంత కర్ణాటక, గోవా మధ్య రైలు అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ఈ కొత్త యశ్వంతపూర్-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. ఈ రైలు హసన్, సకలేశ్పుర, సుబ్రహ్మణ్య రోడ్, మంగళూరు, ఉడిపి, కుందాపుర, మురుడేశ్వర, గోకర్ణ, కార్వార్ వంటి పలు కీలక స్టేషన్లకు నేరుగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
నవంబర్ 13న రెండు ప్రత్యేక ప్రారంభ సర్వీసులు నడిచిన తర్వాత నవంబర్ 15 నుంచి ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని నైరుతి రైల్వే పేర్కొంది. నైరుతి రైల్వే నవంబర్ 15, 2026 నుండి యశ్వంతపూర్-మడ్గావ్-యశ్వంతపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు నంబర్ 26655 యశ్వంతపూర్ జంక్షన్ నుంచి ఉదయం 7:35 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 8:55 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది. ఈ రైలు శ్రావణ బెళగొళకు ఉదయం 9:03 గంటలకు చేరుకుంటుంది. హసన్ కు ఉదయం 9:38, సకలేశ్పురకు ఉదయం 10:20, సుబ్రహ్మణ్య రోడ్ కు మధ్యాహ్నం 12:40, కబాకపుత్తూరుకు మధ్యాహ్నం 1:25, మంగళూరు జంక్షన్ కు మధ్యాహ్నం 3:05, ఉడిపికి సాయంత్రం 4:20, కుందాపురకు సాయంత్రం 4:38, మూకాంబికా రోడ్ బైందూరుకు సాయంత్రం 5:20, మురుడేశ్వరకు సాయంత్రం 6:00, గోకర్ణ రోడ్ కు సాయంత్రం 7:00, కార్వార్ సాయంత్రం 7:45 గంటలకు చేరుకుంటుంది.

ఈ రైలు వారంలో ఆరు రోజులు (బుధవారం మినహా) నడుస్తుంది. మొత్తం ప్రయాణ సమయం 13 గంటల 20 నిమిషాలు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 26656 మడ్గావ్ నుంచి ఉదయం 8:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 9:15 గంటలకు యశ్వంతపూర్ జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైలు కార్వార్ కు ఉదయం 9:03, గోకర్ణ రోడ్ కు ఉదయం 9:48, మురుడేశ్వర్ కు ఉదయం 11:00, మూకాంబికా రోడ్ బైందూర్ కు ఉదయం 11:20, కుందాపురకు ఉదయం 11:48, ఉడిపికి మధ్యాహ్నం 12:18, మంగళూరు జంక్షన్ కు మధ్యాహ్నం 1:50, కబాకపుత్తూరు కు మధ్యాహ్నం 2:43, సుబ్రహ్మణ్య రోడ్ కు మధ్యాహ్నం 3:28 , సకలేశ్పురకు సాయంత్రం 5:30, హాసన్ కు సాయంత్రం 6:13, శ్రావణబెళగొళకు సాయంత్రం 6:43 గంటలకు చేరుకుటుంది. మొత్తం ప్రయాణ సమయం 12 గంటల 55 నిమిషాలు ఉంటుంది. ఈ తిరుగు ప్రయాణ సేవ గురువారాలు తప్ప,వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. రెండు రైళ్లలోనూ 16 కోచ్‌లు ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications