11వ రోజు పెరిగిన ధరలు, జూన్ 7 నుండి రూ.6కు పైగా పెరుగుదల
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 11వ రోజు పెరిగాయి. నేడు (జూన్ 17, బుధవారం) లీటర్ పెట్రోల్ పైన 55 పైసలు, లీటర్ డీజిల్ పైన 60 పైసలు పెరిగింది. ఈ రోజు పెరుగుదలతో ఈ పదకొండు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.6.02, లీటర్ డీజిల్ ధర రూ.6.40 పెరిగింది. కరోనా - లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్షిస్తున్న కంపెనీలు ప్రతి రోజు పెంచుతున్నాయి.
తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.73 నుండి రూ.77.28 పెరిగింది. డీజిల్ ధర రూ.75.19 నుండి రూ.75.79కి పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.79.08, డీజిల్ రూ.71.38, ముంబైలో పెట్రోల్ రూ.84.15, డీజిల్ రూ.74.32, చెన్నైలో పెట్రోల్ రూ.80.86, డీజిల్ రూ.73.69కి పెరిగింది. హైదరాబాదులో పెట్రోల్ రూ.80.22కు, డీజిల్ రూ.74.07కు, అమరావతిలో పెట్రోల్ రూ.80.66, డీజిల్ రూ.74.54కు చేరుకుంది.

నిన్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. చమురు రంగ సంస్థలు ఈ నెలలో జెట్ ఫ్యూయర్ ధరలను పెంచడం ఇది రెండోసారి. ఢిల్లీలో ATF ధరలు 16.3 శాతం పెరిగాయి. కిలో లీటర్ (KL) రూ.5,494.5 పెరిగిన తర్వాత ఇప్పుడు రూ.39,069.87గా ఉంది. రాష్ట్రాల లోకల్ ట్యాక్స్‌ను అనుసరించి ఏటీఎఫ్ ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. ఏటీఎఫ్ ధరలను ప్రతి నెలలో 1 తేదీన, 16వ తేదీన సమీక్షిస్తారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజువారీగా సమీక్షిస్తాయి కంపెనీలు.


Click it and Unblock the Notifications