Rice: దేశంలో భారీగా పెరుగుతున్న బియ్యం, చక్కెర ధరలు..!
దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారీగా పెరిగిన బియ్యం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దేశంలో వరి ఉత్పత్తి దాదాపు 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో వరి ఉత్పత్తి వరుసగా 10 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్నప్పటికీ, పదేళ్లలో తొలిసారిగా వరి సాగు క్షీణించనుంది. 2009-10లో ఎల్ నినో వరి ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన తర్వాత, ఇప్పుడు మళ్లీ అలాంటిదే జరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ధర, అలాగే చిల్లర మార్కెట్‌లో అమ్మే బియ్యం ధర కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
థాయ్‌లాండ్, వియత్నాంలో బియ్యం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరింది. ఈ ఏడాది తక్కువ వర్షపాతం కారణంగా బియ్యం ఉత్పత్తి సుమారు 10 మిలియన్ టన్నుల మేర తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ చైర్మన్ పి.వి. కృష్ణారావు చెప్పారు. గత ఏడాది 154 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తితో పోలిస్తే, ఈ 10 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి 6.5 శాతం తక్కువగా ఉందన్నారు. 2009-10 ఎల్ నినో కాలం తర్వాత నమోదైన అత్యల్ప వరి ఉత్పత్తి ఇదేనని పేర్కొన్నారు.మరోవైపు చక్కె ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇథనాల్ తయారీ వల్ల చెరకు వడడం వల్ల చక్కెర ధర భారీగా పెరిగింది.

ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇతర దేశాల నుంచి చక్కెర దిగుమతి పెంచింది. అయినప్పటికీ చక్కెర ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉల్లి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఉల్లి కిలో రూ.70 నుంచి రూ.80 పలుకుతోంది. కేంద్రం బఫర్ స్టాక్ విడుదల చేస్తున్న ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. అటు వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. వెల్లుల్లి, అల్లం ధరలు కూడా భారీగానే పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల మిగతా వస్తువులపై ప్రభావం పడుతుంది.
మిగతా వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతిగా దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్ లీనో ప్రభావం వల్ల పంట దిగుబడులు భారీగా తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో గోధుమలు, పప్పులు, కూరగయాల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
