Onion Price: భారీగా పెరుగుతోన్న ఉల్లి, వెల్లుల్లి ధర.. వంట నూనె ధరలు కూడా భారీగానే..

మనం భారీగా వినియోగంచే ఉల్లి ధర క్రమంగా పెరుగుతోంది. రెండు నెలల కిందటి వరకు కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.25 ఉండేది. కాని ప్రస్తుతం ఉల్లి ధర కిలోకు రూ.50 లకు చేరింది. ఉల్లి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉల్లి సాగు తగ్గడంతో డిమాండ్ సరిపడా ఉల్లి రావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే ఉల్లి ధర పెరుగుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే రోజుల్లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 పలుకే అవకాశం ఉందని చెబుతున్నారు. మార్కెట్ లోకి కొత్త ఉల్లి రావాలంటే రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఉల్లి ధర ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఉల్లి ధర పెరగడంతో చాలా మంది ఉల్లి వాడకాన్ని తగ్గించారు. ఇక పానీ పూరి బండి వద్ద ఉల్లి చాలా తక్కువగా వేస్తున్నారు. మిర్చి బండి వద్ద ఉల్లిపాయలు వేయడం లేదు. ఆనియన్ దోశకు పలు చోట్ల ధరలు పెంచారు. అయితే రెండు, మూడు నెలల తర్వాత ఉల్లి ధర దిగొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు వెల్లుల్లి ధరలు కూడా భారీగానే పెరిగాయి. రైతు బజార్ లో కిలో వెల్లుల్లి రూ. 245 - రూ. 260 వరకు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్, సూపర్‌మార్కెట్లు కిలో రూ. 278 వరకు ఉంది. అల్లం ధర కూడా పెరిగింది. అల్లం కిలో రూ.150 నుంచి రూ.200 పలుకుతోంది.

Onion

కోడి గుడ్ల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. మొన్నటి వరకు రిటైల్ ఒక్కో కోడి గుడ్డు రూ.8 ఉండగా.. ఇప్పుడు రూ.6.50 చేరింది. హెల్ సేల్ లో ఒక్కో గుడ్డు రూ.6 పలుకుతుంది. ఇక చికెన్ ధర కూడా ఎక్కువగానే ఉంది. మొన్నటి వరకు కిలో రూ.360 పలికిన చికెన్ ఇప్పుడు కిలో రూ.250 నుంచి రూ.300 మధ్య ఉంది. అయినప్పటికీ కోడి గుడ్డు, చికెన్ ధర ఎక్కువగానే ఉన్నాయి. అయితే కూరగాయల ధరలు నెల కిందటితో పోలిస్తే కాస్త తగ్గాయి. అయితే వంట నూనె ధరలు మాత్రం భారీగానే ఉన్నాయి. పామాయిల్ లీటర్ రూ. 120 నుంచి రూ.130 పలుకుతోంది. ఇక సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.170 నుంచి రూ.180 ఉంది.

దీనికి తోడు ఎల్బీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ ధర ఎక్కువగా ఉంది. సిలిండర్ షార్టేజ్ తో అప్పట్లోనే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, టిఫిన్ సెంటర్లు టిఫిన్ ధరలు పెంచాయి. ఇప్పుడు వంట నూనె పెరుగుదలతో ధరలు మరింత పెంచుతున్నారు. శుక్రవారం విడుదలైన ఒక నివేదిక ప్రకారం ఏడాది క్రితంతో పోలిస్తే శాకాహార థాలీ ధర 4 శాతం పెరగ్గా, మాంసాహార థాలీ ధర 9 శాతం పెరిగింది. ఉల్లిపాయలు, వంట నూనె, ఎల్‌పిజి (LPG), చికెన్ ధరలు పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని నివేదికలో పేర్కొన్నారు.ఏ డాది క్రితంతో పోలిస్తే ఉల్లిపాయల ధరలు 20 శాతం ఎక్కువగా ఉండగా, వంట నూనె ధర 11 శాతం మరియు ఎల్‌పిజి సిలిండర్ ధర 10 శాతం పెరిగాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+