Edible Oil: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. తగ్గనున్న వంట నూనెల ధరలు..!
దేశంలో క్రమంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. అలాగే బియ్యం ధరలు కూడా పెరిగాయి. ఆ మధ్య భారీగా పెరిగిన చక్కెర ధర ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టింది.అటు వంట నూనెల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు వంట నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ముడి పామాయిల్, సోయాబీన్ నూనెలపై సుంకాన్ని సగానికి తగ్గించగా, ముడి పొద్దుతిరుగుడు నూనెపై పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఈ మార్పుల ప్రకారం ముడి పామాయిల్, ముడి సోయాబీన్ నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (BCD) 10 శాతం నుంచి 5 శాతాని తగ్గించినట్లు ప్రకటించింది.
ముడి పొద్దుతిరుగుడు నూనెపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. ప్రభుత్వం శుద్ధి చేసిన వంట నూనెలపై కూడా సుంకాలను తగ్గించింది. శుద్ధి చేసిన పామాయిల్, శుద్ధి చేసిన సోయాబీన్ నూనెలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 32.5 శాతం నుంచి 27.5 శాతానికి చేర్చింది. ఇక శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనెపై సుంకాన్ని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించింది. 23 సెప్టెంబర్ 2026 నాటి నోటిఫికేషన్ నెం. 31/2026-కస్టమ్స్ ప్రకారం, సవరించిన సుంకాలు సెప్టెంబర్ 24 నుంచి అమల్లోకి వస్తాయి. గత ఏడాది కాలంలో భారతదేశంలో కూరగాయల నూనెల ధరలు దాదాపు 20 శాతం పెరిగిన తరుణంలో ఈ సుంకాల తగ్గించారు.

సాధారణంగా డిమాండ్ పెరిగే సెప్టెంబర్-నవంబర్ పండుగల కాలానికి ముందు ఇది ఆందోళనలను పెంచుతోంది. తక్కువ దిగుమతి సుంకాలు దేశీయ వంట నూనెల ధరలను తగ్గించడంలో సహాయపడతాయి. స్వీట్లు, స్నాక్స్, వేయించిన ఆహారాలలో ఉపయోగించే నూనెల వినియోగం పెరగనుంది. ప్రపంచంలోనే కూరగాయల నూనెలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా భారత్ ఉంది. ఇండిటయా తన అవసరాలలో దాదాపు మూడింట రెండు వంతుల దిగుమతులు చేసుకుంటుంది.
పామాయిల్, సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనెలు ఎక్కువగా దిగుమతి చేసుకోంటుంది. భారతదేశానికి వంట నూనెల సరఫరా ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా, అర్జెంటీనా, రష్యా, ఉక్రెయిన్ నుంచి వస్తుంది. ఈ తాజా సుంకాల మార్పులు ముఖ్యమైన వంట నూనెలపై దిగుమతి సుంకాల భారాన్ని తగ్గిస్తాయని, పెరిగిన ధరల మధ్య దేశీయ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
