IPO News: ఇదిరా ఐపీవో అంటే..! తొలిరోజే భారీ లాభాలతో పిచ్చెక్కించిన కంపెనీ..
Presstonic Engineering IPO: కొత్త వారం స్టాక్ మార్కెట్లలో కొత్త ఐపీవోల కోలాహలం మెుదలైంది. ఈ క్రమంలోనే నేడు మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో పెట్టుబడిదారులకు సూపర్ లాభాలను అందించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు అట్టహాసంగా స్టాక్ మార్కెట్లలో జాబితా చేయబడిన ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్ కంపెనీ ఐపీవో గురించే. మార్కెట్లో ఐపీవో స్టాక్ ఒక్కోటి రూ.140 రేటు వద్ద జాబితా చేయబడింది. వాస్తవానికి స్టాక్ ఇష్యూ ధర రూ.72గా ఉన్నప్పటికే.. 94.4 శాతం అధిక రేటు వద్ద జాబితా చేయబడింది. అయితే లిస్టింగ్ తర్వాత కంపెనీ షేర్లలో స్వల్ప క్షీణతను నమోదు చేశాయి.

వాస్తవానికి ఐపీవో డిసెంబర్ 11న తన ఇష్యూను సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవగా డిసెంబర్ 13న ముగిసింది. ఐపీవో కోసం లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఐపీవోలో పార్టిసిపేట్ చేసేందుకు కనీసం ఒక లాట్ కొనుగోలు చేసేందుకు రూ.1,15,200 పెట్టుబడిగా పెట్టారు. తాజాగా ఐపీవో నేడు NSE SME కేటగిరీలో జాబితా చేయబడింది.
ప్రెస్టోనిక్ ఇంజినీరింగ్ ఐపీవో నుంచి రూ.23.30 కోట్లను సమీకరించింది. దీనికోసం 32.37 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 47.45 శాతం వాటా రిజర్వ్ చేయబడింది. ఐపీవోకు ముందర కంపెనీలో ప్రమోటర్ల షేర్ హోల్డింగ్స్ 99.97 శాతంగా ఉండగా.. షేర్ల విక్రయం తర్వాత 57.99 శాతానికి తగ్గింది. అలాగే మూడు రోజుల సబ్‌స్క్రిప్షన్ సమయంలో 234 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ కేటగిరీ 188.94 రెట్లు, ఇతర కేటగిరీలు 133.56 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడ్డాయి.


Click it and Unblock the Notifications