Budget Economic Survey 2025: రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నేడు పార్లమెంటరీ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముమ్ము ఎకనమిక్ సర్వే గురించి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ముందుగా ఆమె మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై సంతాపం ప్రకటించగా మహా కుంభ్ మేళాలో తొక్కిసలాటలో మరణించిన వారికి నివాళి అర్పించారు.
మధ్యతరగతి ప్రజల ఇంటి యాజమాన్య కలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముర్ము వెల్లడించారు. వక్ఫ్ బిల్లును తమ పరిపాలన తీసుకున్న ప్రగతిశీల చర్యగా అభివర్ణించారు. అలాగే నారీశక్తి గురించి మాట్లాడుతూ.. మహిళలు దేశంలో ప్రగతి చెందటంపై హర్షం వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో మహిళలు భాగస్వాములుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లటంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహిళలు దేశంలో యుద్ధ విమానాలను సైతం నడుపుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలను నడిపించటం నుంచి ఒలంపిక్స్ వరకు అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నారని వెల్లడించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలోని లక్షలాది మంది ప్రజల సొంతింటి కల నెరవేరుస్తున్నట్లు ద్రౌపది ముర్ము వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద ఏకంగా అర్హులైన పేదలకు 3 కోట్ల గృహాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రభుత్వ రవాణా కోసం అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా దేశం అడుగులువేస్తున్నట్లు ద్రౌపది పేర్కొన్నారు. దేశంలోని 10 కోట్ల మందికి పైగా మహిళలు స్వచ్ఛంద సంస్థలతో ముడిపడి ఉన్నారని, లఖపతి దీదీల సంఖ్యను కూడా నిరంతరం పెంచుతున్నామని రాష్ట్రపతి అన్నారు. కొన్ని నెలల క్రితమే బీమా సఖీ ప్రచారాన్ని కూడా ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు.
భారతీయ యువత స్టార్టప్ నుంచి అంతరిక్షం వరకు దేశానికి కీర్తిని తెచ్చిపెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి స్కీమ్స్ యువత ప్రగతికి దోహదపడ్డాయన్నారు. గత బడ్జెట్ తర్వాత తీసుకొచ్చిన ఇంటర్న్‌షిప్ పథకం యువత ఉపాధి అవకాశాలను దేశంలో మెరుగుపరుస్తోందని ఆమె పేర్కొన్నారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీని స్వీకరించడంలో దేశం ముందు వరుసలో ఉందన్నారు. విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా పదివేలకు పైగా పాఠశాలల్లో అటల్ ల్యాబ్‌లు ప్రారంభమయ్యాయి.
డిజిటల్ టెక్నాలజీలో దేశం కీలక గ్లోబల్ ప్లేయర్‌గా ఎదుగుతోందని ముర్ము వెల్లడించారు. పెరుగుతున్న ఏఐ టెక్నాలజీలు ప్రపంచ వ్యాప్తంగా గేమ్ చేంజర్లుగా వ్యవహరిస్తున్న వేళ దీని ప్రోత్సహించటానికి ప్రభుత్వం ఇండియా AI మిషన్ ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. బ్యాంకింగ్, జిడీ పేమెంట్ సఖీలు మారుమూల ప్రాంతాల ప్రజలను ఆర్థిక వ్యవస్థకు లింక్ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications