AP Vs Telangana: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ వేగంగా పెట్టుబడుల ఆకర్షణ చేపడుతున్నాయి. వేల కోట్ల పెట్టుబడుల నుంచి వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వరకు తేడాలేకుండా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
అయితే ఈ క్రమంలోనే తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తాజాగా తన 4 GW సోలార్ పీవీ టాప్కాన్ సెల్ తయారీ ఫెసిలిటీని తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి ఏపీలోని నెల్లూరు నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్క్‌కు మార్చాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది భవనాల నిర్మాణానికి సైతం తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన దరఖాస్తులను సమర్పించింది.

కానీ ఇప్పుడు కంపెనీ తన నిర్ణయాన్ని మార్చుకుని ఏపీలో తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇది తెలంగాణ నుంచి వ్యాపారాలు తరలిపోతున్న ధోరణిని సూచిస్తుంది. దీనికి ముందు గతంలో కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థ తన పెట్టుబడిని తెలంగాణ నుంచి తమిళనాడుకు తరళించిన సంగతి తెలిసిందే. అలాగే కేన్స్ సెమీకండక్షన్ సంస్థ కూడా తమ పెట్టుబడిని తెలంగాణ నుంచి గుజరాత్ రాష్ట్రానికి తరలించింది. ఇది తెలంగాణలో పెట్టుబడులు తగ్గిస్తున్న ధోరణిని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు కూడా రాష్ట్రాన్ని వీడటంతో ఏకంగా రూ.1,700 కోట్ల పెట్టుబడిని తెలంగాణ చేజార్చుకుందని తెలుస్తోంది.
ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ఈ తరలింపు వెనుక గల కారణాన్ని బీఎస్ఈ ఫైలింగ్స్ లో వెల్లడించింది. కంపెనీ తన సిలికాన్ ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ సౌకర్యాలను సోలార్ పీవీ సెల్ తయారీ కార్యకలాపాలతో సహ-స్థానాన్ని గుర్తించడం ద్వారా బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్ వ్యూహాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఏపీ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రీమియర్ ఎనర్జీస్‌కు 269.71 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఇప్పటికే కేటాయించిన 169.71 ఎకరాలు, సూత్రప్రాయంగా ఆమోదం పొందిన మరో 100 ఎకరాలు ఉన్నాయి. కొత్త స్థలంలో ప్రతిపాదిత 4 GW సోలార్ సెల్ టాప్‌కాన్ సౌకర్యం, 5 GW సిలికాన్ ఇంగోట్ అండ్ వేఫర్ తయారీ కర్మాగారం ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ అధికారిక వర్గాలు సైతం ధృవీకరించాయి. కంపెనీ తమ కార్యకలాపాలను ఏర్పాటు చేయటానికి భారీగా స్థల కేటాయింపులను అడిగిందని భారతదేశ ఎనర్జీ వ్యూహాలకు అనుగుణంగా ఈ పెట్టుబడులు జరుగుతున్నట్లు వెల్లడించబడింది. దీనికి తోడు రవాణా సౌకర్యాలు కూడా ఉండటం కలిసొస్తున్న అంశంగా వారు అభివర్ణిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications