Premier Energies IPO GMP: ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ భారీ స్పందన.. గ్రే మార్కెట్ ఎలా ఉందంటే..!
ప్రీమియర్ ఎనర్జీస్ ఐపీఓ(IPO)కు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. చివరి రోజున పెట్టుబడిదారుల నుంచి స్పందన రావడంతో ఈ పబ్లిక్ ఇష్యూ భారీగా సబ్స్క్రైబ్ అయింది. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ తన షేర్లను ఒక్కొక్కటి రూ.427-450 ధరలో విక్రయిస్తోంది. పెట్టుబడిదారులు కనీసం 33 షేర్లకు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఐపీఓ ద్వారా రూ. 2,830.40 కోట్లను సమీకరించాలని భావించింది.
ఇక ఈ ఐపీఓలో రూ. 1,291.40 కోట్ల తాజా వాటా విక్రయం, 3.42 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS) ఉన్నాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్‌ల (QIBలు) కేటాయింపు 134.51 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. అయితే నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NIIలు) కోసం రిజర్వ్ విభాగం 46.67 రెట్లు సబ్‌స్క్రిప్షన్ కాగా.. ఉద్యోగుల పోర్షన్ 9.63 సార్లు సబ్స్క్రైబ్ అయింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్ కోసం కేటాయించిన కోటా అదే సమయంలో 6.90 రెట్లు సబ్‌స్క్రైబ్ పొందింది.

ప్రీమియర్ ఎనర్జీస్ ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్స్, సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తుంది. దీని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో సెల్, సోలార్ మాడ్యూల్, మోనోఫేషియల్ మాడ్యూల్స్, బైఫేషియల్ మాడ్యూల్స్, EPC సొల్యూషన్‌లు , O&M సొల్యూషన్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 1995లో కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి ఐదు తయారీ యూనిట్లు ఉన్నాయి. అన్ని కూడా మన తెలంగాణలోనే ఉన్నాయి. ప్రీమియర్ ఎనర్జీస్ గ్రే మార్కెట్ ప్రీమియం స్థిరంగా ఉంది.
పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన నేపథ్యంలో కంపెనీ అనధికారిక మార్కెట్‌లో ఒక్కో షేరుకు రూ. 390-395 ప్రీమియమ్‌గా ట్రేడవుతోంది.
ప్రీమియర్ ఎనర్జీస్ దేశంలో రెండో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ , మాడ్యూల్ తయారీదారుగా ఉంది. జూలై 31, 2024 నాటికి, PEL రూ. 5,926.6 కోట్ల విలువైన ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. ఇందులో 25 శాతం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రాగా.. మిగిలిన ప్రైవేట్ కంపెనీల నుంచి వచ్చాయి.
ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీకి చెందిన అర్హులైన ఉద్యోగుల కోసం రూ. 10 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేసింది. ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.22 తగ్గింపు కూడా ప్రకటించారు.


Click it and Unblock the Notifications