న్యూఢిల్లీ: విమానయాన టిక్కెట్ల ధరల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకునే ఉద్దేశ్యం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి మంగళవారం తెలిపారు. విమానయాన సంస్థలు భారత్‌లో పోటీ పడి మరి టిక్కెట్ ధరలను తగ్గిస్తున్నాయన్నారు. ఇదే కొనసాగితే చాలా విమానయాన సంస్థలు మూతబడతాయని హెచ్చరించారు.

వాస్తవ రేట్లు వసూలు చేయాలి
ధరలకు కళ్లెం వేసే ఆలోచనలు ప్రభుత్వానికి లేవని హర్దీప్ పూరి చెప్పారు. మార్కెట్లో సమానత్వం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ధరల కోతే విమానయాన సంస్థల కష్టాలకు కారణమని కూడా చెప్పలేమన్నారు. కానీ ఇది కూడా ఓ కారణమని చెప్పారు. విమానయాన సంస్థలతో మాట్లాడిన తర్వాత పోటీపడి ధరలు తగ్గించడం తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. వాస్తవ రేట్లను వసూలు చేయాలని తాను విమానయాన సంస్థలకు చెబుతున్నానని అన్నారు.

ఎయిరిండియా విక్రయంపై...
ఎయిర్ ఇండియా విక్రయంపై కూడా ఆయన స్పందించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను కొన్ని వారాల్లో విక్రయించనున్నట్లు చెప్పారు. ఎయిరిండియా వల్ల రోజుకు రూ.26 కోట్ల నష్టం వస్తోందన్నారు. దీనిని ప్రయివేటీకరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పారు. అయితే పెట్టుబడిదారుల సెంటిమెంట్ తక్కువగా ఉందని, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అప్పుల్లో ఉన్న ఎయిరిండియాను కొనేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు.

మహారాజా గొప్ప బ్రాండ్
ఎయిరిండియా జాతీయ సొత్తు అని, మహారాజా గొప్ప బ్రాండ్ అని, 120 విమానాలను కలిగి ఉందని హర్దీప్ పూరి చెప్పారు. ఇందులో సగం సొంతగా ఉండగా, మిగతా సగం లీజుకు నడుస్తున్నట్లు చెప్పారు. ఇది 40 నుంచి 50 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణీకులను చేరవేస్తోందని, రాబోవు కొద్ది రోజుల్లో విక్రయమవుతుందని భావిస్తున్నామని, త్వరలో ప్రయివేటీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు.

ఉద్యోగులకు శుభవార్త... మూతబడదు
మార్చి నాటికి ఎయిరిండియా అమ్ముడుపోకుంటే మూతబడుతుందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కూడా పూరి స్పందించారు. ఎయిరిండియా మూతబడదని ధైర్యం చెప్పారు. రియల్ ఎస్టేట్ వంటి కంపెనీలు అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎదుర్కొంటాయని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదుర్కొంటోందన్నారు. అదే సమయంలో ఎయిరిండియా ఎంతకు అమ్ముడవుతుందనే ప్రభుత్వ అంచనాల గురించి ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేదు. ఎయిరిండియాను ఓ భారతీయ సంస్థ చేజిక్కించుకోవాలని తాము కోరుకుంటున్నామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications