బంగారం, వెండి ధరలు ఈ రేటు వద్దకు వచ్చే దాకా ఆగండి.. కొనుగోలుదారులకు ఆర్థిక నిపుణులు కీలక సూచన
ప్రస్తుతం అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అసాధారణమైన బుల్లిష్ ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ Gold ధరల పెరుగుదల కొనసాగవచ్చని నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ నిపుణులు అభిలాష్ కోయిక్కర విశ్లేషిస్తున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ధరల కదలికను గమనిస్తే.. ఇటీవలి కనిష్ట స్థాయిల నుండి ధరలు వేగంగా పుంజుకున్నాయి.
చార్టుల ప్రకారం బంగారం ధర సైడ్‌వేస్ నుండి బుల్లిష్ వైపు మళ్లుతోంది. ప్రస్తుతం ట్రెండ్‌లైన్ రెసిస్టెన్స్‌కు ఎగువన ట్రేడింగ్ జరుగుతుండటం మార్కెట్‌లో ఉన్న బలమైన సానుకూల ధోరణిని సూచిస్తోంది. స్వల్పకాలికంగా ధరలు ఎక్కడైనా తగ్గితే, అది కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశంగా మారుతుందని, పతనం అంత సులభం కాదని నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధరలకు సంబంధించి రూ. 1,47,500 స్థాయి ఒక కీలకమైన మద్దతు (Support) గా నిలుస్తోంది. ధరలు ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు బుల్లిష్ నిర్మాణం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఒకవేళ ధరలు తగ్గినా, ఈ మద్దతు స్థాయి వద్ద మళ్ళీ కొనుగోలుదారులు యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం MCXలో బంగారం రూ. 1,52,600 వద్ద ట్రేడ్ అవుతుండగా, తదుపరి లక్ష్యాలు రూ.1,61,000 నుండి రూ. 1,65,000 గా ఉన్నాయి. ఒకవేళ Gold ధరలు 147,500 కంటే దిగువన స్థిరంగా ముగిస్తేనే ఈ బుల్లిష్ అంచనా బలహీనపడుతుంది. అప్పటివరకు ఇన్వెస్టర్లు సానుకూల దృక్పథంతో ఉండవచ్చు. మొమెంటం సూచికలు కూడా బంగారం ధరలు మరింత పైకి వెళ్తాయని స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి.
MCX Gold business వ్యూహం ఇదే..
CMP: 152,600
టార్గెట్: 165,000
స్టాప్ లాస్: 147,500
మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధరలు తన పాత కనిష్టాల నుండి కోలుకుని, విస్తృతమైన కన్సాలిడేషన్‌లో నిలదొక్కుకుంటున్నాయి. ప్రస్తుతానికి వెండిలో పెద్ద ట్రెండ్ పైకే కనిపిస్తున్నందున, ప్రతి తగ్గుదలనూ కొనుగోలు అవకాశంగా మలుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వెండికి రూ. 2,36,000 స్థాయి అత్యంత కీలకమైన మద్దతుగా ఉంది.
మార్కెట్ ఈ స్థాయి పైన ఉన్నంత వరకు ధరలు మళ్ళీ పుంజుకుంటూనే ఉంటాయి. ఒకవేళ రూ. 2, 36,000 కంటే దిగువకు పడిపోతే తప్ప, బుల్లిష్ ధోరణికి ముప్పు ఉండదు. ప్రస్తుతం వెండి ధర రూ. 2, 53,300 వద్ద ఉండగా, ఇది త్వరలోనే రూ. 2, 60,000 మార్కును చేరుకుని, ఆపై రూ. 2, 80,000 స్థాయిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
MCX Silver వ్యాపార వ్యూహం ఇదే..
CMP: 253,300
టార్గెట్: 280,000
స్టాప్ లాస్: 236,000
మొత్తంగా చూసినట్లయితే అటు బంగారం, ఇటు వెండి రెండూ తమ బుల్లిష్ ఊపును కొనసాగిస్తున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటూ, పైన పేర్కొన్న మద్దతు స్థాయిల వద్ద స్టాప్-లాస్‌లను (Stop Loss) ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. సానుకూల సాంకేతిక సూచికలు, మార్కెట్ సెంటిమెంట్ మద్దతుతో, బులియన్ మార్కెట్ రాబోయే సెషన్లలో మరిన్ని కొత్త రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది.
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కూడా ఈ లోహాల ధరలకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయి, దీనివల్ల సురక్షితమైన పెట్టుబడిగా వీటికి గిరాకీ పెరుగుతోంది. ఇన్వెస్టర్లు రూ. 1, 65,000 (బంగారం), రూ. 2,80,000 (వెండి) లక్ష్యాలతో తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
