IPO News: ఒడిదొడుకుల్లో ఐపీవో సూపర్ లిస్డింగ్.. తొలిరోజు ఇన్వెస్టర్లకు తుఫాను లాభాలు..

Pratham EPC Projects IPO: కొత్త వారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులకు లోనైన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో పెట్టుబడిదారుల జేబులను లాభాలతో నింపేసింది.

ఇప్పుడు మనం మాట్లాడుకుబోతున్నది ప్రథమ్ ఈపీసీ ప్రాజెక్స్ ఐపీవో గురించే. నేడు ఈ కంపెనీ ఐపీవో ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో జాబితా అయ్యాయి. తొలిరోజే మార్కెట్లు జాబితా సమయంలో కంపెనీ ప్రీమియం లాభాలను అందించటంతో ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు. వాస్తవ ఇష్యూ ధర కంటే 51 శాతం ప్రీమియం రేటు రూ.113 వద్ద నేడు ప్రథమ్ కంపెనీ ఐపీవో షేర్లు జాబితా అయ్యాయి. వాస్తవానికి కంపెనీ ఇష్యూ గరిష్ఠ ధరను రూ.75గా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Pratham EPC Projects IPO Made 51Percent premium listing with bumper gains on first day Know details

రిటైల్ ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం కంపెనీ షేర్లు మార్చి 11-13 వరకు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.36 కోట్ల మూలధనాన్ని విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం 48 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఐపీవో మూడు రోజుల కాలంలో 178.54 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.71 నుంచి రూ.75గా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పెట్టుబడిదారుల కోసం లాట్ పరిమాణాన్ని 1,600 షేర్లుగా నిర్ణయించగా.. ఇందుకోసం కనీసం రూ.1.20 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.

తాజా ఐపీవో నుంచి సేకరించిన మెుత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, యంత్రాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలను తీర్చుకునేందుకు వినియోగించనుంది. ప్రథమ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ ఐపీవో బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్ బీలైన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్ట్రార్ లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పనిచేశాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+