IPO News: ఐపీవోపై దాడి చేసిన ఇన్వెస్టర్లు.. గంటలోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్ ఓవర్..
Pratham EPC Projects IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి రోజుకో ఐపీవో ప్రవేశించటానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు వీటిపై బెట్టింగ్ వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రథమ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ ఐపీవో గురించే. ఈ కంపెనీ తన ఐపీవోను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం మార్చి 11 నుంచి మార్చి 13 వరకు తెరచి ఉంచుతోంది. ఆశ్చర్యకరంగా ఐపీవో తెరవబడిన గంటలోనే 100 శాతం వాటాలను ఇన్వెస్టర్లు ఎగబడి కొనేశారు. కంపెనీ ఇష్యూ కోసం ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కొక్కటి రూ.71 నుంచి రూ.75గా నిర్ణయించింది. లిస్టింగ్ రోజున లాభాలను పొందేందుకు అనేక మంది పెట్టుబడిదారులు బెట్టింగ్ వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఒంటి గంట సమయానికి ప్రథమ్ ఐపీవో 4.32 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ విభాగం గరిష్టంగా 7.44 రెట్లు సభ్యత్వాన్ని పొందింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల కేటగిరీలో ఇప్పటివరకు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ రాలేదు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 2.82 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. పెట్టుబడిదారుల కోసం కంపెనీ లాట్ పరిమాణాన్ని 1600 షేర్లుగా నిర్ణయించింది. కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేయాలనుకునే రిటైల్ ఇన్వెస్టర్లు ఇందుకోసం కనీసం రూ.1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. మార్చి 7న కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.10.25 కోట్లను సమీకరించింది.
ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో మార్కెట్ల నుంచి రూ.36 కోట్లను సమీకరిస్తోంది. ఇందుకోసం కంపెనీ 48 లక్షల తాజా షేర్లను జారీ చేసింది. ఇన్వెస్టర్స్ గెయిన్ ప్రకారం.. గ్రే మార్కెట్‌లో కంపెనీ పనితీరు అద్భుతంగా కొనసాగుతోంది. నేడు ఒక్కో షేరుపై రూ.96 ప్రీమియం ధర పలుకుతోంది. ఈ లెక్కన మెుదటి రోజు లిస్టింగ్ సమయంలోనే పెట్టుబడిదారులకు ఐపీవో 100 శాతానికి పైగా లాభాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications