కాలం కలిసి రాకపోతే రాజును కూడా పేదవాడిగా మారుస్తుంది. కూతురి పెళ్ళి కోసం రూ.550 కోట్లు ఖర్చు చేసిన ప్రమోద్ మిట్టల్ చిన్న చిన్న ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన రోజు వస్తుందని బహుశా ఊహించి ఉండడు. ఒకప్పుడు ప్రపంచ బిలియనీర్లను ఏలిన లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ గురించి తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఉండేవి. కానీ బ్యాడ్ టైం వచ్చాక ప్రతిదీ నాశనమైపోయింది దింతో అతను దివాలా తీసాడు. ఒకానొక సమయంలో తన వ్యక్తిగత ఖర్చులు కూడా తన భార్య, పిల్లలు భరిస్తున్నారని ఆయన మీడియాకు చెప్పారు. ఈ రోజుల్లో అతను ఏమి చేస్తున్నాడనే దాని గురించి ఇంటర్నెట్‌లో ఎటువంటి సమాచారం లేదు. ఉక్కు వ్యాపారవేత్త అయినా లక్ష్మీ మిట్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ స్టోరీ చాలా వెరైటీగా ఉంటుంది. ఒకప్పుడు అతను ఇంగ్లాండ్‌లోని అత్యంత ధనవంతులలో ఒకడు. కానీ కాలం ఎలా మలుపు తిరిగిందంటే అతను బ్రిటన్‌లో అతిపెద్ద దివాలా తీసిన వ్యక్తిగా అయ్యాడు.

వెయ్యి కోట్లకు పైగా అప్పుతో 68 ఏళ్ల మిట్టల్ 2020లో లండన్‌లోని ఇన్సాల్వెన్సీ అండ్ కంపెనీ కోర్టు దివాలా తీసినట్లు ప్రకటించింది . ఉక్కు వ్యాపారానికి రారాజుగా మారిన మిట్టల్ తనకు భారీగా అప్పు ఉందని పేర్కొన్నారు. ఇందులో అతని తండ్రికి కూడా చాల అప్పు ఉంది. ప్రమోద్ మిట్టల్ సొంత భార్య సంగీత నుంచి ఇంకా కుమారుడు దివ్యేష్ నుంచి బావమరిది అమిత్ లోహియా నుంచి కూడా భారీగా అప్పుడు తీసుకున్నారని నివేదిక పేర్కొంది.
ఒకానొక సమయంలో తన ఆస్తి విలువను కోటి రూపాయలుగా ప్రకటించుకున్నాడు అలాగే తనకు వ్యక్తిగత ఆదాయం లేదని పేర్కొన్నాడు. దీనితో పాటు, ఢిల్లీ సమీపంలో తన పేరు మీద కొంత ఆస్తి మాత్రమే ఉందని కూడా చెప్పాడు. మిట్టల్ బ్యాంకుల నుండి అప్పుగా తీసుకున్న మొత్తానికి కేవలం కొంత మాత్రమే చెల్లించడానికి ముందుకొస్తున్నట్లు బ్రిటిష్ దినపత్రిక నివేదించింది. నాకు, నా భార్యకు వేర్వేరు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ప్రతి నెలా నా వ్యక్తిగత ఖర్చులకి నా భార్య, కుటుంబ సభ్యులు భరిస్తున్నారని ఆయన అన్నారు.
ప్రమోద్ మిట్టల్ ఉత్తర బోస్నియాలో ఒక కంపెనీని ప్రారంభించాడు. మెటలర్జికల్ కోక్ అనే పదార్థాన్ని తయారు చేసిన ఈ కంపెనీ పేరు GIKIL. ప్రమోద్ మిట్టల్ కూడా ఈ కంపెనీలో వాటాదారుడు ఇంకా సీనియర్ అధికారులలో ఒకరు. అతను ఈ కంపెనీ కోసం బ్యాంకు నుండి లోన్ తీసుకున్నాడు అంతేకాక కంపెనీ లోన్ తిరిగి చెల్లించలేకపోతే తానే తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. దీని అర్థం కంపెనీ దివాలా తీస్తే, ప్రమోద్ మిట్టల్ మొత్తం అప్పును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే అతని కష్టాలు మొదలయ్యాయి. 2013 సంవత్సరంలో, GIKIL కంపెనీ 166 మిలియన్ డాలర్ల లోన్ తిరిగి చెల్లించలేకపోయింది. ప్రమోద్ మిట్టల్ గ్యారెంటీ ఇచ్చినందున, అతను ఈ డబ్బునంతా బ్యాంకుకు ఇవ్వాల్సి వచ్చింది.
ప్రమోద్ మిట్టల్‌ను 2019లో బోస్నియాలో పోలీసులు పట్టుకున్నారు. కంపెనీకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అక్రమాలు చేశాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. భారతదేశంలో అతనిపై మరో దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈ దర్యాప్తు దాదాపు రూ.2,200 కోట్ల మోసం కేసుకు సంబంధించినది, దీనిలో అతను అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించారా లేదా అనేది పరిశీలిస్తున్నారు. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) అనే ప్రభుత్వ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించకపోవడంతో అతను ఆ సంస్థను మోసం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రమోద్ మిట్టల్ కూడా దివాలాని చట్టపరంగా ఎదుర్కొంటున్నప్పటికీ, ఆ ప్రక్రియలో అయ్యే ఖర్చులను ఇతరులు భరిస్తున్నారని అన్నారు.
ఆయన తన కూతురు పెళ్ళికి అప్పట్లో దాదాపు రూ.550 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తాపత్రికలు, టీవీల్లో వార్తలు వచ్చాయి. ఈ వివాహం స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగింది. అతని కుమార్తె సృష్టి నెదర్లాండ్స్‌కు చెందిన గుల్‌రాజ్ బహల్‌ను వివాహం చేసుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications