PM Jan Dhan Yojana: 50 కోట్లు దాటిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు..
దేశంలోని పేదలకు బ్యాంక్ ఖాతాలకు తెరిపించాలని ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ 2014లో ప్రారంభించిన ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద ఖాతాదారుల సంఖ్య 50 కోట్లు దాటింది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద, 56 శాతం బ్యాంకు ఖాతాలను మహిళలు తెరవగా, గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో 67 శాతం బ్యాంకు ఖాతాలు తెరిచారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కింద 28 ఆగస్టు 2014న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. ఈ పథకం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బ్యాంకులు అందించిన డేటా ప్రకారం, ఆగస్టు 9, 2023 నాటికి జన్ ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది. ఈ ఖాతాదారులలో 34 కోట్ల ఖాతాలకు రూపే కార్డులు ఉచితంగా జారీ అయ్యాయి.

ఈ పథకం కింద మహిళల కోసం 56 శాతం బ్యాంకు ఖాతాలు ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో 67% బ్యాంకు ఖాతాలు తెరిచారని వివరించింది. జన్ ధన్ ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.2.03 లక్షల కోట్లకు చేరిందని పేర్కొంది. అంటే ప్రతి జన్ ధన్ ఖాతాలో సగటున రూ.4,076 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిపింది. ఈ 50 కోట్ల మందిలో 5.5 కోట్ల మంది ఖాతాదారులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాలు దేశ ఆర్థిక పరిస్థితిని మార్చడంలో పెద్ద పాత్ర పోషించినట్లు కేంద్రం వివరించింది. దేశంలోని ప్రతి వయోజనుడికి వారి బ్యాంకు ఖాతా ఉందని చెప్పింది. జన్ ధన్ ఖాతాల ఖాతాదారులకు అనేక రకాల ప్రయోజనాలు అందిస్తున్నట్లు వివరించింది. ఈ పథకం కింద ఖాతా తెరిచేవారికి కనీస ఖాతా బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు. ఉచిత రూపే కార్డుతో పాటు, ఇది రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనం ఉంటుంది.


Click it and Unblock the Notifications