ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీగా సొంత ఇల్లు కావాలా.. ఇలా అప్లయ్ చేసుకొండి..
సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతిఒక్క సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అయితే సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. అందులోనే భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 (PMAY 2.0) అనే పథకాన్ని తీసుకొచ్చిన సంగతి మీకు తెలిసిందే. ఈ పథకం ముఖ్య లక్ష్యం పట్టణ ప్రాంతాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) అలాగే మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం. ఈ పథకాన్ని 9 ఆగస్టు 2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.
ఈ పథకం కింద కోటి కొత్త ఇళ్లులు నిర్మించనున్నారు. ఒక్కో ఇంటికి రూ.2.30 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలిదశలో పట్టణ ప్రాంతాల్లో 1.18 కోట్ల ఇళ్లను మంజూరు చేయగా, అందులో 85.5 లక్షల ఇళ్లను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు ఇప్పటికే అందజేశారు.

ఈ స్కిం ముఖ్య ఉద్దేశం
ఆర్థికంగా బలహీనంగా, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇంటిని అందించడం ఇంకా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల అవసరాలకి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం అంతేకాకుండా 2024 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతంగా శాశ్వత ఇల్లు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చనుంది.
ఎలా అప్లయ్ చేసుకోవాంటే
ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి తరువాత PMAY-అర్బన్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీరు ఫామ్ నింపడానికి అప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి & PMAY-U 2.0 కోసం అప్లయ్ అనే అప్షన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు కోసం సూచనలు
మీ సంవత్సర ఆదాయం, ఇతర ముఖ్యమైన వివరాలను ఎంటర్ చేయడం ద్వారా అర్హత తెలుసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీ గుర్తింపు వెరిఫై చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ పేరు, అడ్రస్, ఆదాయ వివరాలు సహా ఇతర సమాచారాన్ని ఎంటర్ చేయండి. అప్లికేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేసి స్టేటస్ సమాచారం కోసం వేచి చుడండి.
అప్లయ్ చేసుకోవడానికి కావాల్సిన డాకుమెంట్స్
ఆధార్ కార్డ్, గుర్తింపు కార్డు (PAN కార్డ్/డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ ID), ఇన్కమ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్, బ్యాంక్ వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల కొరతను తగ్గించడమే కాకుండా ఆర్థికంగా బలహీన వర్గాలకు గొప్ప సహాయం అందిస్తుంది.


Click it and Unblock the Notifications