Stock Market: బీజేపీ గెలిస్తే స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఇదే.. ప్రముఖ ఇన్వెస్టర్ ట్వీట్..
BJP Winning: ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రివ్యూగా పరిగణించబడతాయి. అందుకే వీటిని అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు వివిధ దశల్లో పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో నాలుగు రాష్ట్రాల ఫలితాలు నేడు వస్తుండగా.. మిజోరం ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ప్రస్తుతం వేవ్ చూస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుండగా.. మిగిలిన మూడు చోట్ల బీజేపీ హవా కనిపిస్తోంది. అయితే ఈరోజు విడుదలయ్యే ఫలితాల ప్రభావం తప్పకుండా రేపు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ తరుణంలో ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు, నిపుణుడు పీఆర్ సుందర్ కూడా తన ట్విట్టర్‌లో స్టాక్ మార్కెట్లపై ఎన్నికల ఫలితాల ప్రభావం గురించి కీలక పోస్చ్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే స్టాక్ మార్కెట్ పెరుగుతుందని, కాంగ్రెస్ గెలిస్తే స్టాక్ మార్కెట్ రెండింతలు పెరుగుతుందని పీఆర్ సుందర్ తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. డిసెంబర్ 1న సుందర్ చేసిన ఈ ట్వీట్ ఎక్కువ మంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది.
ఈ ట్వీటుపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ కాంగ్రెస్ గెలిస్తే స్టాక్ మార్కెట్లు నష్టపోతాయని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కొందరు బీజేపీ గెలిస్తే లాభదాయకమనంగా.. మరికొందరైతే ఎవరు గెలిచినా మార్కెట్లు క్షీణిస్తాయని అభిప్రాయపడ్డారు. టెక్సా అనే ఖాతా నుంచి కాంగ్రెస్ గెలిచిన తర్వాత స్టాక్ మార్కెట్ ఏ సంవత్సరంలో పెరిగిందో చెప్పగలరా అని ప్రశ్నించారు. అందుకు పీఆర్ సుందర్ బదులిస్తూ 2009 విజయం సమయంలో నిఫ్టీ 20 శాతం వరకు ర్యాలీ నమోదు చేసినట్లు బదులిచ్చారు.


Click it and Unblock the Notifications