For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF, సుకన్య సమృద్ధి యోజన నిబంధనల సడలింపు, డిపాజిట్ గడువు పొడిగింపు

|

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) నిబంధనల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. ఈ అకౌంట్స్ కలిగిన వారు తప్పనిసరిగా చేయాల్సిన కనీస డిపాజిట్ గడువును మూడు నెలల పాటు పొడిగించింది. ఈ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నందున చిన్న మొత్తాల డిపాజిట్‌దారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

భారత్‌కు కరోనా షాక్: ఈ రంగంలోనే ప్రమాదంలో 1.5కోట్ల ఉద్యోగాలు,భారత్‌కు కరోనా షాక్: ఈ రంగంలోనే ప్రమాదంలో 1.5కోట్ల ఉద్యోగాలు,

పీపీఎఫ్, ఎస్ఎస్‌వై ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఖాతాదారులు ఒక ఏడాదిలో కొంత మొత్తాన్ని కచ్చితంగా డిపాజిట్ చేయాలి. లేదంటే జరిమానా విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని 80C కిందకు ఈ పథకాలు వస్తాయి. దీంతో ఆర్థిక సంవత్సరం చివరలో ఈ ఖాతాలు కలిగిన వారు డిపాజిట్ చేయాలి. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో డిపాజిట్ చేయకుంటే ఇప్పుడు జూన్ 30వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో వీరికి ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. డిపాజిట్ చేసిన తేదీ నుండి వడ్డీ వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ.1.5 లక్షల మొత్తం మాత్రమే డిపాజిట్ చేయాలి. అంతకుమించి డిపాజిట్ చేస్తే దానికి వడ్డీ ఉండదు.

PPF, Sukanya Samriddhi scheme deposit rules eased

NPS ఉపసంహరణకు పీఎఫ్ఆర్డీఏ ఆమోదం

నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) సబ్‌స్క్రైబర్లు కరోనా సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎఫ్ఆర్డీఏ ఆమోదం లభించింది. ఆ వ్యాధిని మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రాణాంతకమైన అనారోగ్యంగా దాన్ని పరిగణించి నిధుల ఉపసంహరణకు అనుమతించినట్టు తెలిపింది. చందాదారులు, వారి చట్టబద్ధమైన భార్య లేదా భర్త, పిల్లలు, వారిపై ఆధారపడిన పేరెంట్స్ ఎవరికైనా కరోనా సోకితే చికిత్స వ్యయం కోసం నిధులను పాక్షికంగా తీసుకోవచ్చు.

English summary

PPF, సుకన్య సమృద్ధి యోజన నిబంధనల సడలింపు, డిపాజిట్ గడువు పొడిగింపు | PPF, Sukanya Samriddhi scheme deposit rules eased

In view of the lockdown due to the coronavirus outbreak, the government has eased deposit rules for some small savings schemes including Public Provident Fund (PPF) and Sukanya Samriddhi scheme.
Story first published: Sunday, April 12, 2020, 18:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X