Buzzing Stock: మార్కెట్లలో ఆటుపోట్లు తీవ్రంగా ఉన్నప్పటికీ కొన్ని కంపెనీల షేర్లు మాత్రం రాకెట్ వేగంతో ముందుకు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాణ రంగంలోని కంపెనీ రికార్డుల మోత మోగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగంలో దిగ్గజ సంస్థ పవర్ మేక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ షేర్లు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 20% పెరిగి రూ.5,062.25కి చేరుకున్నాయి. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ షేర్లకు ఇది కొత్త 52 వారాల గరిష్ఠ ధర. షేర్లలో ఈ పెరుగుదల మెగా ఆర్డర్ కారణంగా నమోదైంది.

పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వ యాజమాన్యంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) నుంచి మైన్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్ ప్రాజెక్ట్(MDO)ని పొందింది. ఈ మెగా ఆర్డర్ విలువ రూ.30,438 కోట్లుగా ఉంది. అయితే దీని కాలవ్యవధి 28 ఏళ్లు. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ షేర్లు శుక్రవారం రూ.4,218.55 వద్ద ముగిశాయి. కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.878.95గా ఉంది.
జార్ఖండ్‌లోని ఝరియా కోల్ ఫీల్డ్స్ వద్ద ఉన్న తసరా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తుంది. కాంట్రాక్టు ప్రకారం పవర్ మెక్ ప్రాజెక్ట్స్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఓవర్‌బర్డెన్ తొలగింపు, కోకింగ్ కోల్ మైనింగ్, క్రషింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ను చేపట్టనుంది. అదనంగా కంపెనీ 3.5 MTPA సామర్థ్యం గల కోల్ వాషరీని ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని SAILకు స్టీల్ గ్రేడ్ కోకింగ్ బొగ్గును సరఫరా చేస్తుంది. పవర్ మెక్ ప్రాజెక్ట్స్ PC పటేల్ ఇన్‌ఫ్రాతో కన్సార్టియంలో ఆర్డర్‌ను పొందింది. ఈ కన్సార్టియంలో పవర్ మేక్ ప్రాజెక్ట్స్‌కు 24% వాటా ఉంది. కాగా పీసీ పటేల్ ఇన్‌ఫ్రాకు 26 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications