Small Savings Schemes: ఇప్పటి వరకు కేవలం బ్యాంకుల్లో చేసే ట్రాన్సాక్షన్లపై మాత్రమే పరిమితులు, పర్యవేక్షణ ఉండేవి. ఈ క్రమంలో పరిమితులను దాటి చెల్లింపులు జరిగితే వాటి వివరాలను బ్యాంకులు ఆదాయపుపన్ను అధికారులకు షేర్ చేసేవారు. అయితే అచ్చం ఇలాంటి రూల్స్ ఇకపై పోస్టల్ శాఖలోనూ రాబోతున్నాయి.
చాలా కాలంగా రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను విపరీతంగా పెంచటంతో క్రెడిట్ రిస్క్ లేకుండా వడ్డీ ఆదాయం పెరగటం చిన్న పొదుపు పథకాలను దేశంలో మరింత ఆకర్షనీయంగా మార్చేసింది. అయితే మనీలాండరింగ్, టెర్రరిస్ట్-ఫైనాన్సింగ్ వంటి కార్యకలాపాలను నిరోధించేంజుతు ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులపై ఒక కన్నేసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల కేవైసీ ప్రక్రియను తప్పక పూర్తి చేయాలని ఇటీవల సర్క్యులర్ విడుదల చేసింది.

సర్క్యులర్ ప్రకారం ఇండియా పోస్ట్‌లో ఖాతాలను కలిగి ఉన్న కస్టమర్లను తక్కువ, మధ్యస్థ, అధిక ప్రమాదం అనే మూడు విభాగాలుగా విభజించబడతారు. పొదుపు ఖాతాలో బ్యాలెన్స్ రూ.50 వేలకు మించుకుండా లేదా మెచ్యూరిటీ సర్టిఫికెట్ల విలువ రూ.50 వేల వరకు కలిగి ఉంటే వారిని తక్కువ రిస్క్ కింద పరిగణిస్తారు. అలాగే రూ.50,000 నుంచు రూ.10 లక్షల వరకు పెట్టుబడులున్న వారికి మధ్యస్థ కేటగిరీ కిందకు, రూ.10 లక్షలకు పైబడి పెట్టుబడులు పెట్టేవారిని అధిక రిస్క్ కేటగిరీ కిందకు విభజించారు.
ఈ మూడు కేటగిరీల్లోని ఇన్వెస్టర్లకు కేవైసీ కింద ఆధార్, పాన్ కాపీలతో పాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను అందించటం తప్పనిసరి చేశారు. చిరునామా రుజువులో ప్రస్తుత చిరునామా లేకుంటే, డ్రైవింగ్ లైసెన్స్, యుటిలిటీ బిల్లులతో సహా ప్రభుత్వం సూచించిన ఎనిమిది పత్రాల్లో దేని కాపీనైనా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే జాయింట్ హోల్డర్ల విషయంలో ప్రతి పెట్టుబడిదారుడు విడివిడిగా KYC పూర్తి చేయాల్సి ఉంటుంది. తక్కువ రిస్క్ కేటగిరీ వారు ఏడేళ్లకొకసారి, మధ్యస్థ రిస్క్ కలిగిన వారు ఐదేళ్లకొకసారి, అధిక రిస్క్ కేటగిరీలోని వారు రెండేళ్లకు ఒకసారి కేవైపీ మళ్లీ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో రూ.10 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ విలువైన నగదు లావాదేవీలకు సంబంధించిన వివరాలను పోస్టర్ అధికారులు ఇకపై ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షలకు మించి పెట్టుబడులు చేస్తున్నా లేక ఖాటాతో డబ్బు కలిగి ఉండే పోస్టల్ ఖాతాదారులు సదరు ఆదాయానికి సంబంధించిన వివరాలను తప్పక వెల్లడించాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications