Postal Scheme: పోస్టల్ స్కీమ్ డబుల్ ధమాకా.. భారీ వడ్డీతో పాటు పన్ను రాయితీ..
Post Office: భారతీయులు తమ పెట్టుబడులకు అత్యంత సురక్షితంగా భావించే వాటిలో పోస్టల్ డిపార్ట్మెంట్ స్కీమ్స్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. ప్రభుత్వం మంచి వడ్డీ ఆదాయంతో పాటు ఎల్లప్పుడూ మంచి స్కీమ్స్ ప్రజలకోసం ప్రవేశపెడుతూనే ఉంటుంది.
పోస్టాఫీసులో చిన్న పొదుపు పథకాలు చాలా మందిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్ల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) మాత్రం పెట్టుబడిదారులకు అనేక బ్యాంక్ FDల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కింద కస్టమర్లు 5 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. స్కీమ్ కింద కస్టమర్లు తమ పెట్టుబడిని కనీసం రూ.1,000తో ప్రారంభించవచ్చు. ఖాతాదారులు డిపాజిట్ చేసిన మూలధనంపై అత్యధికంగా 7.7% వడ్డీని పొందుతారు.

పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ పెట్టుబడిదారులకు ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ప్రయోజనం ఉంటుంది. పన్ను చట్టాల ప్రకారం ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే పథకం కింద పెట్టుబడులపై వచ్చే వడ్డీపై ఎటువంటి TDS తీసివేయబడదు. దీనిని మీరు దేశంలోని ఏదైనా పోస్టాఫీసులో ఇందుకోసం ఖాతాను తెరవవచ్చు.
దేశంలోని ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న వివిధ వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాలానికి తన వినియోగదారులకు FDపై 6.50 శాతం వడ్డీని ఇస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 5 ఏళ్ల కాలానికి FDపై 6.50% వడ్డీని, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే కాలానికి 6.50% వడ్డీని, HDFC బ్యాంక్ సేమ్ కాలానికి 7% వడ్డీని చెల్లిస్తున్నాయి.


Click it and Unblock the Notifications