చిన్న మొత్తాల పొదుపులకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ కొత్త నియమాలు జారీ చేసింది. ఈ నియమాల ప్రకారం.. మూడు సంవత్సరాలు వాడని చిన్న పొదుపు ఖాతాలు ఫ్రీజ్ అవుతాయి. మన దేశంలో చిన్న పొదుపు పథకాలు (Small Savings Schemes - SCS) అనేవి సామాన్యులకు చాలా ముఖ్యమైనవి. వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు దిగువ తరగతి కుటుంబాలు ఎప్పుడూ ముందుంటారు. అయితే తాజాగా తపాలా శాఖ పొదుపు ఖాతాలకు సంబంధించి కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నియమాలకు అనుగుణంగా లేని ఖాతాలను తపాలా శాఖ మూసివేసే అవకాశం ఉంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS), టైమ్ డిపాజిట్ (TD) మరియు రికరింగ్ డిపాజిట్ (RD) వంటి పథకాలలో లక్షల మంది ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. అయితే, ఇప్పుడు పోస్టల్ శాఖ ఈ పథకాల కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. జూలై 15న జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మూడేళ్లు దాటినా కూడా క్లోజ్ చేయని ఖాతాలను అధికారులు ఇప్పుడు స్తంభింపజేయనున్నారు.దీని ప్రకారం.. మీరు ఖాతాను పొడిగించకపోతే లేదా మూసివేయకపోతే అది స్థంభించిపోతుంది. పెట్టుబడిదారుల డబ్బును భద్రపరచడమే లక్ష్యంగా ఈ నియమాలను తీసుకువచ్చింది.

ఈ ఫ్రీజింగ్ యాక్టివిటీని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు తపాళా శాఖ తెలిపింది. ఏటా జనవరి 1, జూలై 1న రెండు సార్లు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ తేదీల నుంచి 15 రోజుల్లోపు చర్య పూర్తి చేస్తారు.జూన్ 30, డిసెంబర్ 31 నాటికి మూడు సంవత్సరాలు పూర్తయిన ఖాతాలు ఈ జాబితాలోకి వస్తాయి.ఈ నేపథ్యంలోనే మెచ్యూరిటీ తీరిన తమ పొదుపు పథకాల ఖాతాలు స్తంభింపజేయకుండా ఉండాలంటే ఖాతాదారులు డిపాజిట్ పథకాన్ని అధికారికంగా పొడిగించడానికి అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది.
ఒక వేళ పొడిగింపు వద్దనుకుంటే ఖాతా మూసివేతకు దరఖాస్తు చేయాలి.ఉదాహరణకు మీ ఖాతా 2022 జూన్‌లో మెచ్యూర్ అయి.. మీరు దానిని పొడిగించకపోతే లేదా మూసివేయకపోతే, 2025 జూలైలో అది ఫ్రీజ్ అవుతుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ నిబంధనలు వచ్చాయి.దీని ఉద్దేశం ఖాతాల నిర్వహణలో పారదర్శకత మరియు భద్రత పెంచడమేనని చెప్పుకోవచ్చు.
ఏయే ఖాతాలకు ఇది వర్తిస్తుంది?
PPF (Public Provident Fund)
SCSS (Senior Citizen Savings Scheme)
NSC (National Savings Certificate)
KVP (Kisan Vikas Patra)
Post Office MIS
Post Office Time Deposit (TD)
Post Office Recurring Deposit (RD)
దీనినిఎలా నివారించాలంటే.. మెచ్యూరిటీకి ముందే ఖాతాను ఖాతాదారులు పొడిగించండం లేదా మూసివేయండం చేయాలి. ఫారమ్ నింపి పోస్టాఫీస్‌లో సమర్పించండి. లేకపోతే మీ ఖాతా ఫ్రీజ్ అవుతుంది.పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ ప్రకారం, ఖాతాదారులు సమయానికి స్పందించకపోతే ఫ్రీజింగ్ ఒక నిరంతర చక్రంగా కొనసాగుతుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications