కేంద్ర ప్రభుత్వం 2026 కొత్త సంవత్సరంలో పొదుపు చేసుకునే వారికి తీపి కబురు అందించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మధ్యతరగతి ప్రజలకు, రిటైర్డ్ ఉద్యోగులకు అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గాలైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ (post office schemes) పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి 1, 2026 నుండి మార్చి 31, 2026 వరకు) సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని బుధవారం (డిసెంబర్ 31, 2025) ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే గతేడాది అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఉన్న వడ్డీ రేట్లే ఈ ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి.
లేటెస్ట్ వడ్డీ రేట్ల వివరాలు
ప్రభుత్వ ప్రకటన ప్రకారం వివిధ పథకాలపై వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి..
- సుకన్య సమృద్ధి యోజన (SSY): ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి యోజన పథకంపై అత్యధికంగా 8.2% వడ్డీ లభిస్తుంది.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): దీర్ఘకాలిక పొదుపుదారులకు ఎంతో ఇష్టమైన పీపీఎఫ్ పై 7.1% వడ్డీ రేటు కొనసాగుతోంది.
- కిసాన్ వికాస్ పత్ర (KVP): దీనిపై 7.5% వడ్డీ లభిస్తుంది. మీ పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): ఎన్ఎస్‌సీ పై 7.7% వడ్డీ రేటును ప్రభుత్వం స్థిరంగా ఉంచింది.
- మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ (MIS): ప్రతినెలా ఆదాయం కోరుకునే వారికి ఈ స్కీమ్ ద్వారా 7.4% వడ్డీ లభిస్తుంది.
- పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్: సాధారణ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాపై 4% వడ్డీ ఉంటుంది.
- టర్మ్ డిపాజిట్లు (FD): మూడేళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.1% వడ్డీ అందుబాటులో ఉంది.
వడ్డీ రేట్లు ఎవరు నిర్ణయిస్తారు?
సాధారణంగా ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. శ్యామల గోపీనాథ్ కమిటీ సూచించిన పద్ధతి ప్రకారం.. మార్కెట్ లోని ప్రభుత్వ సెక్యూరిటీల రాబడిని బట్టి ఈ రేట్లను నిర్ణయిస్తారు.

ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?
చాలా మంది మదుపర్లు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ (post office schemes) అత్యుత్తమ ఎంపిక. ఇవి ప్రభుత్వం మద్దతు ఉన్న పథకాలు కావడంతో మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది. అంతేకాకుండా, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి వంటి పథకాల ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు.
2026 కొత్త సంవత్సరంలో పొదుపు ప్రారంభించాలనుకునే వారికి ఈ స్థిరమైన వడ్డీ రేట్లు మంచి అవకాశం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని తక్కువ ఆదాయ వర్గాల వారికి ఈ స్కీమ్స్ ఆర్థిక భరోసాను ఇస్తాయి. కాబట్టి సరైన పథకాన్ని ఎంచుకుని పొదుపు మొదలుపెట్టండి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications