ఈ పథకంలో నెలకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు లక్షలు చేతికి...
మీ డబ్బును సురక్షితంగా ఉంచేందుకు, ఇతర మార్గాల్లో పెట్టుబడి కంటే ఎక్కువ ప్రయోజనం ఇవ్వడానికి పోస్టాఫీస్ అనే బెనిఫిట్స్‌తో కూడిన పథకాలను అందిస్తోంది. ఇవి సురక్షిత పెట్టుబడి పథకాలుగా చెప్పవచ్చు. ఇండియా పోస్ట్ అందించే ఇలాంటి పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) ఒకటి. కొన్ని సంవత్సరాల్లోనే ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. పోస్టాఫీస్ పథకాల్లో మీ డబ్బు పూర్తిగా భద్రంగా ఉంటుంది. అందుకే మీ డబ్బుపై ఎలాంటి చింత లేకుండా పెట్టుబడిగా పెట్టవచ్చు. మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఉపసంహరణ
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC) స్కీంలో మీ సొమ్ముకు భద్రత ఉంటుంది. ఈ స్కీం మెచ్యూరిటీ పీరియడ్ 5 సంవత్సరాలు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఏడాది తర్వాత కూడా మీ పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఓసారి నిర్ణయిస్తుంది. ఈ పథకంలో రూ.100 నుండి పెట్టుబడిగా పెట్టవచ్చు.

ఈ స్కీంలో ఎక్కువ వడ్డీ రేటు
ప్రస్తుతం ఉన్న 6.8 శాతం వడ్డీరేటుతో అయిదేళ్ల తర్వాత రూ.20.85 లక్షలు పొందాలని మీరు భావిస్తే కనుక అయిదేళ్లలో రూ.15 లక్షలు పెట్టుబడిగా పెట్టాలి. దీనిపై సుమారు రూ.6 లక్షల వరకు వడ్డీ వస్తుంది. ప్రతి సంవత్సరం రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి సంవత్సరం వడ్డీ రేటును మెచ్యూర్ అయిన తర్వాత చెల్లిస్తారు. ప్రతి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఇచ్చే వడ్డీ రేటు కంటే ఈ స్కీంలో ఎక్కువ వడ్డీ ఉంది.

వడ్డీ రేటు ఎంతంటే
ప్రస్తుతం బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 5 శాతం నుండి 6 శాతం వడ్డీ రేటు అందుతోంది. ఆదాయం పన్ను చట్టం(ఐటీ) 80 సీ సెక్షన్ కింద NSC పథకంపై రూ.1.5 లక్షల పెట్టుబడి వరకు పన్ను మినహాయింపు ఉంది. సింగిల్‌గా లేదా జాయింట్ ఖాతాలో సభ్యులు అనుకోని పరిస్థితుల్లో మృతి చెందితే ఆ డబ్బు ముందే ఉపసంహరించుకోవచ్చు. దానికి గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరణతోపాటు కోర్టు ఆదేశాలు అవసరం. ఏడాది తర్వాత ఈ స్కీంను క్లోజ్ చేసుకోవచ్చు. కానీ డిపాజిట్ తేదీ నుండి మూడేళ్ల లోపు ఇది జరగాలి.


Click it and Unblock the Notifications