భారతీయుల పెట్టుబడి పథకాల్లో పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలు ముందుంటాయి. ఇందులో పెట్టుబిడ సురక్షితం కాబట్టి సామాన్య ప్రజలు పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడి పెడతారు. అయితే చాలా మందికి పోస్టాఫీస్ ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలియదు. అయితే తక్కువ రిస్క్ తో కచ్చితమైన రాబడి ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ 'గ్రామ సురక్ష పథకం' ఒకటి. ఈ పథకంలో నెలకు రూ.1500 పెట్టుబడి పెట్టొచ్చు. ఈ క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం వల్ల ఈ పథకం మెచ్యూరిటీపై రూ. 31 నుంచి రూ.35 లక్షలు పొందుతారు.

19 నుంచి 55 సంవత్సరాలు
19 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద సంవత్సరానికి కనీస హామీ మొత్తం 10 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. దీనికి గరిష్ట బీమా మొత్తం 10 లక్షల రూపాయలు. ప్రీమియం చెల్లింపులను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వాయిదాలలో చేయవచ్చు. ప్రీమియం చెల్లించడానికి మీకు 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.

రుణం
మీరు ఈ పథకంలో రుణం కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మీరు దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. కానీ మీరు మెచ్యూరిటీకి ముందే పథకాన్ని రద్దు చేస్తే, మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి 19 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో పెట్టుబడి పెట్టాడని అనుకుంటే. మెచ్యూరిటీ 55 లేదా, 58 లేదా 60 వరకు ఉంటుంది. అంటే మనం పెట్టుబడి పెట్టేటప్పుడే మెచ్యూరిటీని నిర్ణయించుకోవచ్చు.

రూ. 34.60 లక్షల ప్రయోజనం
అతను 55 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే నెలవారీ ప్రీమియం రూ. 1515 అవుతుంది. మీరు 58 సంవత్సరాల పాటు పాలసీని కొనుగోలు చేస్తే, నెలవారీ ప్రీమియం రూ. 1463 అవుతుంది. 60 ఏళ్ల పాటు పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం రూ.1411 అవుతుంది అటువంటి సందర్భంలో, పాలసీదారులు 55 ఏళ్ల పాలసీకి రూ. 31.60 లక్షలు, 58 ఏళ్ల పాలసీకి రూ. 33.40 లక్షలు, 60 ఏళ్ల పాలసీకి రూ. 34.60 లక్షల ప్రయోజనం పొందుతారు. అయితే మీ వయస్సు పెరిగితే ప్రీమియం చెల్లింపు కూడా పెరుగుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications