ఒక్కో నీటి చుక్క కలిస్తేనే కుండా నిండుతుంది అన్నట్లుగా, చిన్న చిన్న పెట్టుబడులతో మీ భవిష్యత్తును ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చు. మీరు కూడా మంచి రాబడితో పాటు రిస్క్ లేని స్కిం కోసం చూస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ పథకాలు మీకు అద్భుతమైన అవకాశం అందిస్తున్నాయి. ముఖ్యంగా, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ప్రతి నెలా చిన్న మొత్తం జమ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాలలో గొప్ప లాభాన్ని అందిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ RD స్కిం ప్రత్యేకతలు: పోస్ట్ ఆఫీస్ RD పథకం అనేది ప్రభుత్వ సహకారం ఉన్న పొదుపు పథకం, ఇది పెట్టుబడిదారులకు ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితమైన రాబడిని అందిస్తుంది. మీరు నెలకు కేవలం రూ. 100తో కూడా RD అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ స్కిం భారత ప్రభుత్వ హామీతో వస్తుంది కాబట్టి మీ డబ్బు 100% సురక్షితంగా ఉంటుంది. దీనిపై వచ్చే వడ్డీ ప్రయోజనం స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అవసరమైనప్పుడు లోన్ సౌకర్యం కూడా ఉంటుంది. అకౌంట్ తెరిచిన తర్వాత మీరు ఎవరినైనా నామినీగా పెట్టుకోవచ్చు. ఈ పథకంలో 3 లేదా 5 సంవత్సరాల కాలపరిమితితో పెట్టుబడి పెట్టవచ్చు.
నెలకు రూ. 2 వేలు జమ చేస్తే 5 సంవత్సరాలలో ఎంత లాభం వస్తుందంటే : మీరు ప్రతి నెలా రూ. 2 వేలతో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభిస్తే 5 సంవత్సరాల (60 నెలలు) తర్వాత మీకు మంచి లాభం వస్తుంది. ప్రస్తుతం, ఈ పథకం కింద వార్షిక వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది, అలాగే 3 నెలల ఆధారంగా లెక్కించబడుతుంది.
గణాంకాల ప్రకారం: మీరు డిపాజిట్ చేసే మొత్తం: రూ. 1,20,000 (రూ. 2,000 x 60 నెలలు). సుమారుగా వచ్చే వడ్డీ: రూ. 21,983. 5 సంవత్సరాల తర్వాత మొత్తం మెచ్యూరిటీ మొత్తం: దాదాపు రూ. 1,41,983
గమనిక: ఇది ఒక అంచనా మాత్రమే. ఖచ్చితమైన గణాంకాల కోసం మీరు అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించవచ్చు.
పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్ ఎలా తెరవాలి: RD పథకంలో పెట్టుబడి పెట్టడానికి మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి RD అకౌంట్ తెరవడానికి ఫామ్‌ను నింపాలి. దీనికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం అవుతాయి. RD అకౌంట్ కనిష్టంగా రూ.100తో ప్రారంభించవచ్చు. మీరు నెలకు రూ. 2 వేల పెట్టుబడి పెట్టాలనుకుంటే, అదే మొత్తంతో RD అకౌంట్ తెరిచి, ప్రతి నెలా జమ చేయవచ్చు. అదనపు ప్రయోజనంగా మీరు ముందస్తు వాయిదా చెల్లింపులపై తగ్గింపు కూడా పొందవచ్చు. ఉదాహరణకు 6 నెలల EMIని కలిపి చెల్లిస్తే లేదా ఒకేసారి 12 నెలల వాయిదాలు చెల్లిస్తే మీకు కొంత మొత్తం తిరిగి లభిస్తుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications