Personal loans: అంతకంతకూ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి ధీటుగా వేతనాల పెంపు ఉండకపోవడంతో పలువురు ఉద్యోగులు ఎక్కువగా పర్సనల్ లోన్స్ పై ఆధారపడుతున్నారు. ఈ విభాగంలో బ్యాంకులతో పాటు ప్రైవేట్ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. చిన్న అమౌంట్ దగ్గర నుంచి పెద్ద మొత్తాల వరకు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటి టెన్యూర్‌తో పాటు రిస్క్ కూడా తక్కువగా ఉండటంతో ఈ బిజినెస్ మూడు పువ్వలు ఆరు కాయలుగా సాగుతోంది.
మొదట్లో కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్లు వంటి పోస్టల్ సేవలకు మాత్రమే పరిమితమైన పోస్ట్ ఆఫీసులు.. కాలక్రమేణా ఆర్థిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాయి. బ్యాంకులతో సమానంగా పట్టణాల్లో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. కేవలం బ్యాంకులు, NBFCలు మాత్రమే కాకుండా పోస్ట్ ఆఫీసులు కూడా పర్సనల్ లోన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. సేవింగ్స్ ఖాతాదారుల రికరింగ్ డిపాజిట్స్ ఆధారంగా వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఐదేళ్లపాటు కొనసాగే RDలో ప్రతినెలా కొంత మొత్తంలో సేవ్ చేయవచ్చు. దీనిపై పోస్ట్ ఆఫీస్ వడ్డీ ఇస్తుంటుంది. ఏ వయసు వారైనా ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. మధ్యలో ఆపేసినా సరే సదరు మొత్తాన్ని 5 ఏళ్ల తర్వాత మాత్రమే చేతికి ఇస్తారు. అయితే ఈ మధ్య ఏదైనా అత్యవసరమైన పక్షంలో బయటకు తీయడానికి మార్గం లేకపోవడంతో.. ఈ పర్సనల్ లోన్‌ను కేంద్రం ఆఫర్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రజలు లోన్స్ కోసం పట్టణాలకు వెళ్లి బ్యాంకులు వంటి ఆర్థిక సంస్థల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం కంటే చెంతనే ఉన్న పోస్ట్ ఆఫీస్ ద్వారా రుణం పొందడం సులువైన మార్గం. దీనికి తోడు ఇతర వాటితో పోలిస్తే పోస్ట్ ఆఫీస్ లో అతి తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. దీంతో ఖాతా తెరిచిన ఏడాది తర్వాత ఒక వ్యక్తికి అయితే 45 వేలు, జాయింట్ అకౌంట్ అయితే 90 వేల వరకు రుణం తీసుకునే అవకాశాన్ని పోస్ట్ ఆఫీస్‌లు కల్పిస్తున్నాయి.


Click it and Unblock the Notifications