బెంగళూరు వాసులను పగటిపూట రూ. 7 కోట్ల దోపిడీ షాక్‌కు గురిచేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారుల వేషం వేసుకున్న ఐదుగురు-ఆరుగురు వ్యక్తుల ముఠా దాదాపు రూ. 7 కోట్ల నగదును క్యాష్ వాన్ నుంచి స్మార్ట్ గా దోచుకెళ్లారు. దేశ సాంకేతిక రాజధానిలో అత్యంత రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరగడం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట మధ్య సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలో జరిగింది. CMS ఇన్ఫో సిస్టమ్స్ సంస్థకు చెందిన క్యాష్ వాన్.. JP నగర్‌లోని HDFC బ్యాంక్ నుండి HBR లేఅవుట్‌కు మూడు పెట్టెల్లో కరెన్సీని తరలిస్తోంది. అశోక పిల్లర్ దగ్గర మారుతి జెన్ హ్యాచ్‌బ్యాక్ వాహనం అకస్మాత్తుగా వ్యాన్‌ను అడ్డుకోవడంతో దోపిడి కథ మొదలైంది. వెంటనే వెనక నుండి ఒక టయోటా ఇన్నోవా కూడా ఆగింది.

పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రకారం.. వీరు తమను RBI అధికారులుగా పేర్కొంటూ మార్గదర్శకాలు ఉల్లంఘించారంటూ వ్యాన్ సిబ్బందిని ఆపి విచారణకు తీసుకున్నారు. డ్రైవర్ బినోద్ కుమార్, కస్టోడియన్ అఫ్తాబ్, ఇద్దరు సాయుధ గార్డులు రాజన్న, తమ్మయ్య.. ఈ నలుగురు CMS ఉద్యోగులు ఎలాంటి ప్రతిఘటన లేకుండా వారి సూచనలను అనుసరించారు.
నకిలీ అధికారులు.. ఇద్దరు గార్డుల తుపాకులను వాన్‌లో వదిలివేయించి, కస్టోడియన్‌తో పాటు ఇన్నోవాలోకి ఎక్కించారు. డ్రైవర్‌కు డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్దకు వెళ్లి RBI అధికారుల తదుపరి ఆదేశాలు కోసం వేచి ఉండమని చెప్పారు. ఇన్నోవాలో ఉన్న నకిలీ అధికారులు వాన్‌ను నిమ్హాన్స్ జంక్షన్ వరకు అనుసరించి.. అక్కడ ముగ్గురు CMS ఉద్యోగులను దిగి సిద్ధాపుర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. నగదు పెట్టెలను ముందుగా RBI వద్దకు తీసుకెళ్తామని కూడా చెప్పారు.
డ్రైవర్ ఒంటరిగా డైరీ సర్కిల్ ఫ్లైఓవర్ చేరుకున్న తర్వాత.. ఇన్నోవాలో వచ్చిన దుండగులు అతనికి తుపాకీ చూపించి మూడు నగదు పెట్టెలను ఒక మారుతి వ్యాగన్ఆర్‌లోకి మార్చి రెండు వాహనాలతో వేగంగా పారిపోయారు. ఈ ప్రదేశాన్ని ముఠా చాకచక్యంగా ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ ఫ్లైఓవర్‌లో పాదచారులు తక్కువగా ఉండటం, వాహనాలు వేగంగా కదలడం, ముఖ్యంగా సిసిటివి కెమెరాలు లేకపోవడం ఈ దొంగలకు అనుకూలంగా మారాయి.
ఈ సంఘటన పోలీసులకు నివేదించడానికి CMS సిబ్బందికి దాదాపు ఒక గంట పట్టింది. ఇది వారి పాత్రపై అనుమానాలు రేకెత్తించింది. నలుగురు CMS ఉద్యోగులు, ఇద్దరు గార్డులను విచారిస్తున్నారు. దుండగులకు క్యాష్ వాన్ షెడ్యూల్, మార్గం, సమయాలపై ఖచ్చితమైన సమాచారం ఉండటం చూస్తే అంతర్గత సహాయం ఉండే అవకాశాన్ని పోలీసులు తోసిపుచ్చటం లేదు.
దోపిడీలో ఉపయోగించిన ఇన్నోవాకు నకిలీ నెంబర్ ప్లేట్ అమర్చబడింది. సాక్షుల ప్రకారం ఒక MUVపై ప్రభుత్వ లోగో కూడా ఉన్నట్లు కనిపించింది. తద్వారా దోపిడీ మరింత నమ్మదగ్గదిగా మారడంతో CMS ఉద్యోగులు కూడా నమ్మాల్సి వచ్చింది. ఈ సంఘటన రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపింది. BJP దీనిని శాంతిభద్రతల వైఫల్యంగా అభివర్ణించింది. సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడంతో పోలీసులు వేలిముద్రలు, కాల్ రికార్డులు, వాహనాల కదలికలను విశ్లేషిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ముఠా వైట్‌ఫీల్డ్, మారతహళ్లి, దోమ్లూర్ లేదా హోసకోట వైపు పారిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications