Shiva Jyothi: ఫోక్స్‌వ్యాగన్ మినీ కూపర్ కారును కొనుగోలు చేసిన శివ జ్యోతి..!
తీన్మార్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి కారు కొనుగోలు చేసినట్లు ఇన్‌స్టాగ్రాములో వీడియో పెట్టారు. తీన్మార్ వార్తల ద్వారా ఫేమస్ అయిన సావిత్రి.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కూడా వెళ్లింది. కాగా శివ జ్యోతి తెలంగాణ యాసలో గలగల మాట్లాడుతూ సావిత్రిగా అభిమానులకు చేరువైంది. తీన్మార్ ద్వారా వచ్చిన గుర్తింపుతో కొన్ని సినిమాల్లోనూ నటించింది. సోషల్ మీడియాలో శివజ్యోతికి భారీగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె తాజాగా భర్తతో కలిసి ఫోక్స్‌వ్యాగన్ మినీ కూపర్ కారును కొనుగోలు చేస్తోన్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
"వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో...మీ దయతో కొత్త ప్రయాణం నాలుగు సంవత్సరాలు అయిందని బీఎమ్‌డబ్ల్యూ ఇచ్చేసి ఇది తీసుకున్నాం బ్రో ...అప్పు చేసి కొన్నాం బ్రో!...అసలు ఏడవకండి" అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. అన్షు, ప్రియాంకజైన్, రోహిణితో పాటు పలువురు యాక్టర్లు శివజ్యోతికి కంగ్రాట్స్ చెప్పారు. శివజ్యోతి ప్రస్తుతం తెలుగులో ఇడుపుకాయితం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రియదర్శి, ఫోక్ సింగర్ నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను బన్నీవాస్‌తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నారు. శివ జ్యోతి వి6 న్యూస్ తీన్మార్ వార్తల్లో బిత్తిరి సత్తితో కలిసి చేసి ప్రాచుర్యం పొందారు.

టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ గా పని చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఫినాలే వరకు వెళ్లారు. 2017లో ఉత్తమ జర్నలిజం పురస్కారం అందుకున్నారు. జోతిక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యారు. ఆమె కుమారి ఆంటీ వీడియోకు యూట్యూబ్ లో భారీగా వ్యూస్ వచ్చాయి. శివజ్యోతికి భర్త గంగూలి, కుమార్తె ఉన్నారు. ఆమె స్వస్థలం నిజామాబాద్ జిల్లాగా చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications