Multibagger Stock: ఎక్కువగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించే వాటిలో పెన్నీస్టాక్స్ ఉంటాయి. ఇవి తక్కువ రేటులో అందుబాటులో ఉంటూ మంచి రాబడులను అందిస్తుంటాయి. తక్కువ సమయంలోనే ఇవి ఊహించని రాబడులను అందిస్తుంటాయి. సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే వారు ఎలా లాభపడతారో ఈ స్టాక్ మనకు తెలియజేస్తుంది. పైగా ఈ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరమ్ సంస్థ యాజమాన్యాని పూనావాలా గ్రూప్ కు చెందినది.

ఫైనాన్స్ స్టాక్ రాబడులు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది పూనావాలా గ్రూప్ కు చెందిన ఫైనాన్స్ సర్వీస్ కంపెనీ అయిన పూనావాలా ఫిన్‌కార్ప్ గురించే. Poonawalla Fincorp Ltd స్టాక్ తన పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించింది. గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 1,926 శాతానికి పైగా రాబడిని అందించింది.

స్టాక్ పై నిపుణుల మాట..
ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ షేర్లు క్రమంగా పెరుగుతున్నాయి. అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు నివేదించిన తర్వాత.. మార్కెట్ నిపుణులు ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉన్నారు. దీనిపై కొనుగోలు చేయాలని సలహాలు కూడా ఇస్తున్నారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ స్టాక్ రూ.314కి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం స్టాక్ రేటు రూ.267.80 వద్ద ట్రేడ్ అవుతోంది.

లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి..
రెండేళ్ల క్రితం NSEలో ఒక్కో షేరు ధర రూ.13.40 స్థాయి వద్ద ఉండేది. కానీ.. ఈ రోజు స్టాక్ రేటు రూ.267.80 వద్ద ట్రేడవుతోంది. ఈ సమయంలో షేర్ దాదాపుగా 1900 శాతానికి పైగా రాబడిని అందించింది. అంటే రెండేళ్ల క్రితం ఈ స్టాక్‌లో ఎవరైనా పెట్టుబడిదారుడు రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారం వారికి దాదాపుగా రూ.20 లక్షల రాబడి వచ్చి ఉండేది.

బలమైన లాభాలు..
బలమైన క్రెడిట్ పంపిణీ, మెరుగైన మార్జిన్‌లతో ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో పూనానాలా ఫిన్‌కార్ప్ లాభం 118% పెరిగి నికర లాభం రూ.141 కోట్లకు చేరుకుంది. ఈ సమయంలో కంపెనీ ఆదాయం రూ.483 కోట్ల నుంచి రూ.572 కోట్లకు పెరిగాయి. పూనావాలా ఫిన్‌కార్ప్, మాగ్మా ఫిన్‌కార్ప్‌తో విలీనం జరిగి ఒక సంవత్సరం పూర్తయింది.

బ్రోకరేజ్ ల మాటేంది..
నిపుణుడు నిర్మల్ బ్యాంగ్ కంపెనీ బలమైన స్థితిలో ఉందని అన్నారు. ఈ కంపెనీ షేర్ రానున్న కాలంలో మరింతగా పెరగవచ్చని తెలిపారు. బ్రోకరేజ్ కంపెనీలు ఈ స్టాక్ కు 'BUY' రేటింగ్ ఇచ్చారు. అయితే స్టాక్ రూ.314 టార్గెట్ ధరను చేరుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం ఇచ్చిన సమాచారం మాత్రమే. దీని ఆదారంగా ఎలాంటి ట్రేడింగ్ చేయకండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేముందు మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించటం ఉత్తమం.


Click it and Unblock the Notifications