Future Multibagger: మల్టీబ్యాగర్ షేర్లను మార్కెట్లో ముందుగా గుర్తించిన వారే మంచి లాభాలను అందుకుంటారు. ఇందుకు ఫండమెంటల్స్ బలంగా ఉండటంతో పాటు భవిష్యత్తు గ్రోత్ అవకాశాలను తప్పక పరిశీలించటం ముఖ్యం.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది మల్టీబ్యాగర్ స్టాక్ పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఒకప్పుడు ఒక్కో షేరు ధర రూ.640 స్థాయిలో ఉండగా.. ఇది రానున్న కాలంలో రూ.4000 మార్కును తాకుతుందని బ్రోకరేజ్ నువామా ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ అంచనా వేసింది. ఈరోజు కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 2.7 శాతం మేర లాభపడి రూ.3,560 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ 'అవుట్ పెర్ఫార్మ్' రేటింగ్ ఇచ్చిన తర్వాత ర్యాలీ ప్రారంభమైంది.

ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ స్టాక్‌పై BUY రేటింగ్ ఇస్తూ కొనుగోలుకు సిఫార్సు చేసింది. ఏడాది కాలంలో ఈ స్టాక్ రూ.4,000 మార్కును చేరుకుంటుందని బ్రోకరేజ్ పాలిక్యాబ్ ఇండియాపై తన అంచనాలను వెల్లడించింది. అలాగే స్టాక్ గడచిన ఏడాది కాలంలో 58.29 శాతం మేర లాభపడి తన ఇన్వెస్టర్లకు ఇప్పటికే మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. అలాగే మూడేళ్ల కాలంలో ఇన్వెస్టర్లు 350 శాతం రాబడిని కంపెనీ షేర్ల నుంచి పొందారు. ఇదే సమయంలో ఐదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే 454 శాతానికిపైగా బలమైన రాబడులను అందించింది.
2023 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పాలీక్యాబ్ షేర్ల ధర 37.18% లాభపడింది. కంపెనీ 10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.20 డివిడెంట్ ప్రకటించింది. కంపెనీ దేశంలోనే అతిపెద్ద వైర్ అండ్ కేబుల్ తయారీదారుగా కొనసాగుతోంది. FY12లో 122 బిలియన్ రూపాయల ఏకీకృత టర్నోవర్‌తో ముందుకు సాగుతోంది. కంపెనీకి దేశవ్యాప్తంగా మెుత్తం 23 తయారీ కేంద్రాలు, 15 కంటే ఎక్కువ కార్యాలయాలు, 25 కంటే ఎక్కువ స్టోరేజ్ గోదాములను కలిగి ఉంది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications