Polycab News: దేశంలోని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కార్పొరేట్ కంపెనీలు తమ మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు వెతుకుతోంది సూపర్ డివిడెండ్ ఆదాయాన్ని అందిస్తున్న కంపెనీ షేర్ల గురించే. వీటిపై బెట్టింగ్ వేయటం ద్వారా తక్కువ కాలంలోనే మంచి రాబడులను అందుకోవాలని వారు చూస్తున్నారు.
ప్రస్తుతం అలాంటి అవకాశం అందిస్తున్న కంపెనీల జాబితాలో ప్రముఖ కేబుల్స్ తయారీ సంస్థ పాలీక్యాబ్ కూడా వచ్చి చేరింది. పాలీక్యాబ్ సంస్థ అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.30 చొప్పున డివిడెండ్ ఆదాయాన్ని అందించాలని నిర్ణయించింది.

రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేరుకు 300 శాతం డివిడెండ్ అందించనున్నట్లు మార్కెట్లకు అందించిన సమాచారంలో పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన రికార్డు తేదీ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. భారీ డివిడెండ్ ఆదాయం కోసం ప్లాన్ చేస్తున్న అనేక మంది ప్రస్తుతం కంపెనీ రికార్డు తేదీని ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీనికి ముందు గతంలో కంపెనీ ఒక్కో షేరుపై ఏకంగా రూ.34 డివిడెండ్ అందించి పెట్టుబడిదారులను సంతోషంలోకి నెట్టేసింది. కంపెనీ చివరిసారిగా జూన్ 21, 2023న డివిడెండ్‌తో ట్రేడింగ్ చేసింది.శుక్రవారం కంపెనీ షేర్ల ధర 6.49 శాతం లాభంతో రూ.6,180.25 వద్ద ట్రేడింగ్ ముగించాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.92,456.54 కోట్లుగా ఉంది.
గడచిన ఏడాదిగా కంపెనీ షేర్ల పనితీరును గమనిస్తే షేర్ల ధరలు 91 శాతానికి పైగా పెరిగాయి. అలాగే మూడు నెలల కాలంలో పెట్టుబడిదారులు 42.9 శాతం రాబడిని అందుకున్నారు. ఇక గడచిన నెల రోజుల్లో కంపెనీ షేర్ల ధరలు 17 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. 2024లో జనవరి నుంచి ఇప్పటి వరకు పాలీక్యాబి స్టాక్ 65 శాతం రాబడిని అందించింది.
శుక్రవారం పాలీక్యాబ్ కంపెనీ తన ఆర్థిక త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 29 శాతం పెరిగి రూ.553 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం 29 శాతం వృద్ధి చెంది రూ.5,592 కోట్లుగా నమోదయ్యాయి. ఆదాయంలో ఈ గణనీయమైన వృద్ధి పాలీక్యాబ్ ఇండియా వ్యాపార వ్యూహాల ప్రభావాన్ని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అవకాశాలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. దేశం మౌలిక సదుపాయాలను పురోగమిస్తున్నందున, దేశ నిర్మాణంలో పాలీక్యాబ్ తన పాత్రకు కట్టుబడి ఉందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications